NRI News: యాత్రా సాహిత్యంలో ఇవి ఎంతో ప్రత్యేకం
ABN, Publish Date - Oct 13 , 2025 | 09:56 AM
అమెరికాలోని డల్లాస్‌లో రెండు పుస్తకాల పరిచయ సభ ఘనంగా జరిగింది. ‘ఊహల కందని మొరాకో’, ‘మనమెరుగని లాటిన్ అమెరికా’ పేర్లతో నిమ్మగడ్డ శేషగిరి ఫేస్‌బుక్‌లో రాసిన కథనాలను, ప్రముఖ రచయిత దాసరి అమరేంద్ర తెలుగులోకి అనువదించారు. ఈ రెండు పుస్తకాల పరిచయ కార్యక్రమం.. డల్లాస్‌లోని సాహితీప్రియుల మధ్య నిర్వహించారు.
మొరాకో, లాటిన్ అమెరికా దేశాల గురించి సాధారణంగా మనకు తెలియని అనేక విశేషాలను గుదిగుచ్చి అందించిన పుస్తకాలు.. యాత్రాసాహిత్యంలో విశిష్టమైనవిగా నిలుస్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. వివిధ దేశాల విశేషాలను తెలుసుకునే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలు చదవాలని పిలుపునిచ్చారు. ఇంగ్లిషులో రాసిన కథనాలను తెలుగులోకి అనువదించి అందుబాటులోకి రావడం విశేషమని వారు అభినందించారు.
అమెరికాలోని డల్లాస్‌లో రెండు పుస్తకాల పరిచయ సభ ఘనంగా జరిగింది. ‘ఊహల కందని మొరాకో’, ‘మనమెరుగని లాటిన్ అమెరికా’ పేర్లతో నిమ్మగడ్డ శేషగిరి ఫేస్‌బుక్‌లో రాసిన కథనాలను, ప్రముఖ రచయిత దాసరి అమరేంద్ర తెలుగులోకి అనువదించారు. ఈ రెండు పుస్తకాల పరిచయ కార్యక్రమం.. డల్లాస్‌లోని సాహితీప్రియుల మధ్య నిర్వహించారు.
కార్యక్రమంలో అమెరికాలోని రచయిత కన్నెగంటి చంద్ర, హరిచరణ్ ప్రసాద్, మద్దుకూరి చంద్రహాస్, లెనిన్ వేముల, దయాకర్ మాడా, ఉరిమిడి నరసింహారెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమానికి అనంత్ మల్లవరపు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా కృష్ణమోహన్ దాసరి, రమణ జువ్వాడి, సురేష్ కాజా, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, స్వప్నప్రియ, నవీన్ గొడవర్తి, శ్రీ బాసాబత్తిన, శ్రీధర్ సిద్ధా, రాజారెడ్డి, శ్రీనివాస్ రాజా, డాక్టర్ ఉమ పాల్గొన్నారు.
Updated Date - Oct 13 , 2025 | 09:56 AM