Bathukamma 2025 Celebrations in Jeddah: సౌదీ అరేబియాలోని జెద్ధాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ABN, Publish Date - Sep 24 , 2025 | 07:36 PM
ఎడారి దేశాలలో ఎటు వైపు చూసినా ఇసుక గుట్టలు, ఎండమావులు, ఉక్కపోతనే.. కానీ అదే చోటా పువ్వూ పువ్వూ ఒకటయి పుడమి పరవశించినప్పుడు ఆడబిడ్డల ఆనందాయకమైన నవ్వు చిరు నవ్వు ఒక్కటయి పున్నమి వెలుగులు విరబూసి గౌరమ్మ నిలిచిన సన్నివేశం సౌదీ అరేబియాలోని జెద్ధాలో అవిష్కృతమైంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: తెలంగాణ సాంస్కృతిక వైభవ కిరీటం బతుకమ్మ. ఈ పండుగ శోభతో బతుకమ్మ జెద్ధాలో వెలిగిపోయింది. పుట్టింటి సంబరం .. మెట్టింటి సంబంధానికి తోడుగా పరాయి సంస్కృతి కల్గిన పరాయి దేశంలో బతుకమ్మను తెలుగు మహిళలు వైభవంగా జరుపుకోన్నారు. జెద్ధా తెలుగు మిత్రుల (జె.టి.యం) అధ్వర్యంలో భారతీయ కాన్సులేటు సౌజన్యంతో తెలుగు ప్రవాసీయుల కుటుంబాలు ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకున్నారు.
బతుకమ్మ వేడుక సంప్రదాయక వస్త్రాధారణతో అణువణువునా స్త్రీ తత్వం ఉట్టిపడింది. జె.టి.యం అధ్యక్షురాలు గాలి దుర్గాభవానీకు తోడుగా సిరిసిల్లాకు చెందిన స్వర్ణజ్యోతి, హైద్రాబాద్ లోని చింతల్‌కు చెందిన కృష్ణవేణిలు అన్ని తామై తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని గౌరమ్మ ఉత్సవాలకు తగ్గకుండా జెద్ధాలో బతుకమ్మను సంప్రదాయక తీరులో నిర్వహించారు.
బతుకమ్మల తయారీలో తంగేడు పువ్వుకు ఒక ప్రత్యెక స్ధానం ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక అయిన తంగేడు పువ్వును తెలంగాణ ప్రభుత్వం అధికార రాష్ట్ర పుష్పంగా ప్రకటించినా తెలంగాణలో తంగేడు అదృశ్యమై దొరకడం కష్టమవుతుంది కానీ ఎక్కడో సౌదీ అరేబియాలో ఎర్ర సముద్రం తీరాన మాత్రం తంగేడు పువ్వులను సాధించారు జెద్ధా తెలుగు మహిళలు.
బతుకమ్మతో సహా ప్రతి తెలుగు పండుగలను తమ సంఘం నిబద్దత, నిష్టతో సంప్రదాయ రీతిలో జరుపుకోంటుందని జె.టి.యం అధ్యక్షురాలు గాలి దుర్గభవానీ పెర్కోన్నారు. రాబీఖ్, జెద్ధాలో పాటు సౌదీలో పువ్వులసాగు పేరొందిన యాన్బూ నుండి కూడ వివిధ రకాల పువ్వులను తాము తెప్పించినట్లుగా అమె చెప్పారు.
సౌదీ అరేబియాలో ప్రవాసీయులు తమ తమ పండుగలను భారతీయ దౌత్య కార్యాలయ అవరణలో నిర్వహించుకోవడం సంతోషదాయకమని భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరీ తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ పండుగను తెలుగువారందరు కలిసి చేసుకోవడం చూడముచ్చటగా ఉందని, ఈ ఉత్సహాన్ని ఇదే విధంగా కొనసాగించాలని ఆయన ఆకాక్షించారు.
స్వర్ణ జ్యోతి, కృష్ణా వేణి, కొంక కవిత, సురేఖ, అన్నపూర్ణ, వీనాక్షి, సుష్మా, సౌజన్య సిరికొండ, ప్రసన్న, వనిత, మంజులు రంగు రంగు పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాపినేని తేజశ్రీ, ప్రియాంకలు ఆధ్యాత్మికంగా విశిష్టతో కన్నుల పండువగా అమ్మవారి విగ్రహాన్ని అలంకరించారు. ఈ సందర్భాంగా భారతీయులకు ఉత్సహాంగా సేవలందిస్తున్నందుకు భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరీ, కాన్సుల్ మహ్మద్ హాషీంలను జె.టి.యం కార్యవర్గం శాలువ కప్పి సన్మానించింది.
జె.టి.యం నాయకత్వంలో దుర్గా భవానీతో పాటు పడమట కోటి శివరామకృష్ణ, సాగర్ కుంటా, గోలీ శ్రీనివాస్, సోడగం వెంకట్ రంగం, కిషోర్ వికటకవి, మల్లిఖార్జున్ తిమ్మపురం, శారదాంబ బ్రహ్మానందం, భారతీ గడిరాజు,అనురాధ ససురాల, రజనీ శ్రీహరిలతో కూడిన కార్యవర్గం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News
Updated Date - Sep 25 , 2025 | 05:37 PM