Share News

AP Assembly Bills 2025: అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

ABN , Publish Date - Sep 24 , 2025 | 09:02 AM

అసెంబ్లీలో వరుసగా రెండో రోజు పలు బిల్లులు ఆమోదం పొందనున్నాయి. అలాగే శాసనమండలిలో పలు కీలక అంశాలపై బుధవారం చర్చ జరగనుంది.

AP Assembly Bills 2025: అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
AP Assembly Bills 2025

అమరావతి, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీలో రెండు బిల్లులను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయం చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి పలు చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఆక్వా, సహకార శాఖలకు సంబంధించి పలు చట్ట సవరణ బిల్లులను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఆముదాలవలస నియోజకవర్గంలో అమృత్ 2 పథకం దుర్వినియోగంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కాలింగ్ అటెన్షన్ ఇవ్వనున్నారు.


ఇంకోవైపు మంగళవారం అసెంబ్లీలో మూడు బిల్లులతోపాటు ఒక తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, భారతీయ నాగరిక్ సురక్షా సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, ఎంఎస్ రాజు, బి.రామాంజనేయులు మద్దతు తెలిపారు. దీనిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక స్థానిక సంస్థలకు నాలా ఫీజు ఇచ్చే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌కు బదులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టారు. దీనిని ఎమ్మెల్యే పార్థసారథి మద్దతు తెలిపారు.


ఇక ఏపీ వ్యవసాయ భూమి చట్టం 2006 రద్దు చేసేందుకు దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు చేసినప్పుడు చెల్లించే నాలా ఫీజును ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఇకపై నాలా ఫీజు స్థానిక సంస్థలకు చెందనుంది. అదే విధంగా మాన్యువల్ స్కావెంజర్ల నియామకం, డ్రై మరుగుదొడ్ల నిర్మాణ నిషేధ చట్టాన్ని రద్దు చేయాలనే తీర్మానాన్ని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టారు. దీనిని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని తీర్మానించింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఫరూఖ్ సభలో ప్రవేశపెట్టారు.


శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి..

చంపా నది నీటి వినియోగం, నూతన బాలిక సంరక్షణ పథకం, శంకర గుప్త ప్రధాన కాలువ అంశాలపై ప్రశ్నోత్తరాల్లో భాగంగా చర్చించనున్నారు. చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయం, జీవీఎంసీలో రహదారి విస్తరణ - మురుగునీటి పారుదల వ్యవస్థ, ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ, గిరిజన నియోజకవర్గాల అభివృద్ధి తదితర ప్రశ్నలకు మంత్రుల సమాధానం ఇవ్వనున్నారు. పాఠశాల విద్యార్థులకు ఏక రూప దుస్తుల కొనుగోలు, అమరావతి అభివృద్ధి పనులపై సైతం సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.


  • శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ జరగనుంది.

  • చేత్తో మరుగు దొడ్లు శుభ్రం చేయటాన్ని నిషేధిస్తూ తీర్మానం చేయనున్నారు.

  • శాసనమండలిలో సైతం నేడు ప్రశ్నోత్తరాలు.

  • రైతులకు సంక్షేమ పథకాలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడం, పర్యాటక శాఖ పరిధిలోని ప్రాజెక్టులపై చర్చ

  • విదేశీ వైద్య పట్టభధ్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్, రాష్ట్రంలో మొక్కలు నాటడం, ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపు, ఎన్టీఆర్ జలసిరి 2.0 తదితర ప్రశ్నలకు మంత్రుల సమాధానం ఇవ్వనున్నారు.

  • పింఛన్ల పంపిణీ బహిరంగ ప్రదేశాలలో అనధికార విగ్రహాలు, పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ ఎస్టీ వ్యవస్థాపకులకు ప్లాట్ల కేటాయింపు ప్రశ్నలకు మంత్రుల సమాధానం చెప్పనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

కమిషనర్‌ వార్నింగ్.. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు

For More AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 09:35 AM