NRI News: బహ్రెయిన్‌లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీల మార్పు.. 19 మంది ప్రవాసీయులకు జైలు శిక్ష..
ABN, Publish Date - Aug 25 , 2025 | 04:49 PM
బహ్రెయిన్‌లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీలను మార్చిన నేరంపై తెలుగువారితో సహా 12 మంది ప్రవాసీయులకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే దేశ బహిష్కరణ శిక్ష కూడా ఎదురైంది. ఆహార భద్రతా ప్రమాణాలను గల్ఫ్ దేశాలన్ని ఖచ్చితంగా పాటిస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీఠ వేస్తాయి. అయినా కొందరు వ్యాపారస్థులు అక్రమాలకు పాల్పడుతుంటారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బహ్రెయిన్‌లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీలను మార్చిన నేరంపై తెలుగువారితో సహా 12 మంది ప్రవాసీయులకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే దేశ బహిష్కరణ శిక్ష కూడా ఎదురైంది. ఆహార భద్రతా ప్రమాణాలను గల్ఫ్ దేశాలన్ని ఖచ్చితంగా పాటిస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీఠ వేస్తాయి. అయినా కొందరు వ్యాపారస్థులు అక్రమాలకు పాల్పడుతుంటారు. ఆ అక్రమాలు వెలుగులోకి వచ్చినపుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది (Bahrain News).
అరబ్బు దేశానికి పని చేయడానికి వచ్చిన ఓ పంజాబ్ యువకుడు తను పని చేస్తున్న సంస్థలోని లొసుగులపై ఫిర్యాదు చేశాడు. దాంతో తెలుగువారితో సహా మరో 19 మంది జైలు పాలయ్యారు. బహ్రెయిన్ లోని ఒక ప్రముఖ ఆహార సామాగ్రి సరఫరా సంస్థలో పని చేస్తున్న తెలుగు వారితో సహా మొత్తం 19 మంది భారతీయులు ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీలను మార్చిన నేరంపై రెండేళ్ల జైలు శిక్షను అనుభవించనున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన వారున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల జిల్లాలకు చెందిన ఒక్కొకరు చొప్పున మొత్తం అయిదుగురు తెలంగాణ ప్రవాసీయులకు బహ్రెయిన్ హైకోర్టు రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది (NRI News).
పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు కొద్ది కాలం క్రితం బహ్రెయిన్ లోని సదరు ఆహార సంస్థలో కార్మికుడిగా పని చేయడానికి వచ్చాడు. అయితే తాను ఆశించిన పని లభించకపోవడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. ఆహార గిడ్డంగిలో ఆహార ప్యాకెట్లపై గడువు ముగింపు తేదీలను మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నారని వీడియో రికార్డింగ్ చేసి నేరుగా బహ్రెయిన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు, వాణిజ్య, ఆరోగ్య శాఖ అధికారులు గిడ్డంగులపై దాడులు చేసి గడువు ముగిసిన 14 వేల వివిధ ఆహార ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 29 మందిని అరెస్ట్ చేసారు.
విచారణ అనంతరం, ఏడుగురు భారతీయులను విడుదల చేశారు. స్థానికులయిన యాజమానులతో పాటు మొత్తం 19 మంది భారతీయులకు జైలు శిక్షలు విధించారు. హై కోర్టుకు అప్పీలుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. కాగా, తమ వలన కష్టాలు ఎదుర్కొంటున్న భారతీయ కార్మికులకు వీలయినంతగా సహాయం చేసేందుకు సదరు సంస్థ సిద్ధమైంది. స్వదేశంలోని వీరి కుటుంబాలకు కూడా ప్రతి నెలా ఆర్థిక సహాయం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రెండేళ్ల జైలు శిక్ష అనంతరం ఈ కార్మికులను దేశం నుంచి బహిష్కరించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
తమ కుటుంబీలు యాజమానులు చెప్పిన ప్రకారం పని చేసారని, వారు స్వంతంగా నేరం చేయలేదు కాబట్టి తమ వారి కేసును సానుభూతితో పరిశీలించి జైలు శిక్షను తగ్గించే విధంగా కృషి చేయాలని శిక్షకు గురైన వారి కుటుంబ సభ్యులు ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రవాసీ సంఘాల నాయకుడు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, మంద భీంరెడ్డిల సహాయంతో దరఖాస్తు చేశారు. వారు ఈ విషయాన్ని బహ్రెయిన్ లోని సామాజిక కార్యకర్త కోటగిరి నవీన్ దృష్టికు తీసుకోవచ్చారు. బహ్రెయిన్ చట్టాలకు లోబడి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామని నవీన్ చెప్పారు. పని చేయడానికి వచ్చిన ప్రతి భారతీయులు స్థానిక చట్టాలను గౌరవిస్తూ పని చేయాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. గద్దకు ఇంత బలముంటుందా.. జింక పిల్లను ఎలా పట్టుకుందో చూడండి..
ఇది రాజమౌళి ఈగ కంటే పవర్‌ఫుల్.. ఓ గోల్ఫర్‌కు రూ.8 కోట్లు సంపాదించిపెట్టింది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 25 , 2025 | 04:49 PM