Home » Bahrain
బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్ పంపించారు.
బహ్రెయిన్‌లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీలను మార్చిన నేరంపై తెలుగువారితో సహా 12 మంది ప్రవాసీయులకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే దేశ బహిష్కరణ శిక్ష కూడా ఎదురైంది. ఆహార భద్రతా ప్రమాణాలను గల్ఫ్ దేశాలన్ని ఖచ్చితంగా పాటిస్తూ ప్రజారోగ్యానికి పెద్ద పీఠ వేస్తాయి. అయినా కొందరు వ్యాపారస్థులు అక్రమాలకు పాల్పడుతుంటారు.
: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌కు (Jaya Shankar) లేఖ రాశారు. పాస్‌పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య(62) సమస్యను ఈ లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.
గల్ఫ్‌లో అనాథలుగా ప్రాణాలు విడిచిన ప్రవాసీయులకు అక్కడి ఎన్నారైలు అంత్యక్రియలు నిర్వహిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
Telangana Polls: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటు ద్వారా మద్దతు తెలియజేయడానికి బీఆర్‌ఎస్ ఎన్నారై నాయకులు దేశ, విదేశాల నుంచి వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
గల్ఫ్ కార్మికులను మోసం చేసింది బీజీపీ పార్టీనే అని ఎన్నారైలు ఫైర్ అయ్యారు. ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు సతీష్ రాదారపు మాట్లాడుతూ, కోరుట్ల నియోజకవర్గంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన కుటుంబాలు చాలా ఉన్నాయి.
రాజకీయ నాయకుల మాటలు ఆకర్షనీయంగా ఉన్నా వారి కార్యచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మి నారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల బహ్రెయిన్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన యువ సంకల్పం అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు.
సాధారణంగా బహ్రెయిన్‌లో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల కోసం దేశ పౌరులు, నివాసితులు భారీగా విదేశాలకు తరలి వెళ్తుంటారు. దీంతో ఈ సీజన్‌లో విదేశీ ప్రయాణానికి డిమాండ్ అధికంగా ఉంటుంది.
ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ కార్యవర్గ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు సబ్బండవర్ణాల ప్రజల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ తెలిపారు.