Share News

Bahrain: రాజకీయ నాయకుల మాటలు తీపి, కార్యచరణ చేదు: సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2023-11-16T06:34:17+05:30 IST

రాజకీయ నాయకుల మాటలు ఆకర్షనీయంగా ఉన్నా వారి కార్యచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మి నారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల బహ్రెయిన్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన యువ సంకల్పం అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు.

Bahrain: రాజకీయ నాయకుల మాటలు తీపి, కార్యచరణ చేదు: సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ

బహ్రెయిన్‌లో యువ సంకల్ప సమ్మేళనంలో సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: రాజకీయ నాయకుల మాటలు ఆకర్షనీయంగా ఉన్నా వారి కార్యచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి. లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల బహ్రెయిన్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన యువ సంకల్పం అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు. కలియుగం ఏ విధంగా ఉంటుందంటూ పాండవులు శ్రీ కృష్ణున్ని అడిగితే.. శ్రీకృష్ణుడు నలుదిక్కులు బాణాలు వేసి నలుగురు పాండువులను బాణాలు తీసుకోరమ్మని పంపుతూ వారు తిరిగి వచ్చెటప్పుడు కనిపించే దృష్యాలను వివరించాలని కోరగా, అందులో నకులుడు తనకు కోకిల మధుర గానం మైమరిపించిందని కానీ ఒక్క సారిగా చూస్తే తనపై రక్తం చుక్కలు ఉన్నాయని, తాను దీన్ని లోతుగా గమనిస్తే మధుర కోకిల తన కాళ్ళ క్రింద ఉడుతను చిధ్రం చేసిందని, ఆ రక్తం ఉడుతదని శ్రీకృష్ణుడు విడమర్చి చెబుతూ కలియుగంలో రాజకీయ నాయకులు కూడా కోకిల విధంగా తీపి కబర్లతో జనాలను చిధ్రం చేస్తారని చెప్పాడని లక్ష్మీనారాయణ అన్నారు.

JDDD.jpg

తాను పోటి చేస్తున్నది లేనిది చెప్పకుండానె తనను కాబోయె పార్లమెంటు సభ్యుడిగా సభకు పరిచయం చేయడం పై నవ్విన ఆయన తన ఉద్దేశ్యాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. ప్రపంచం శూన్యతతో ఉన్న ప్రతిసారి భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకం చేసిందని గౌతం బుద్ధుని నుండి కోవిడ్ వాక్సిన్ వరకు ప్రతిది ప్రపంచానికి భారతదేశం ఇచ్చిందని ఆయన చెప్పారు. ప్రవాసీ భారతీయులు తాము డబ్బు సంపాదన కొరకు మాత్రమే కాకుండా తాము వచ్చిన దేశాల అవసరాలను తీర్చడానికి కూడా వచ్చారని తెలుసుకోని సగర్వంగా ఉండాలని సీబీఐ మాజీ అధికారి ఉధ్బోధించారు. బహ్రెయిన్ విమానశ్రాయంలో దిగిన నుండి ప్రతి చోటా స్ధానిక బహ్రెయినీయులు భారతీయులు అందులోనూ తెలుగు వారి పట్ల ప్రదర్శించిన ఆదరణ అభిమానాలను తనను మంత్రమగ్ధులను చేసిందని ఆయన కొనియడారు. యువ్వనం వయస్సుతో సంబంధం లేకుండా అలోచన విధానంతో ముడిపడి ఉంటుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తమ ఊరికి, దేశానికి తామేం చేసామో ఒక్కసారి ప్రవాసీయులు అలోచించాలన్నారు. ప్రతి ఒక్కరికి తమకు తోచిన రీతిలో మాతృభూమికు సేవ చేసే ఆవకాశం లభిస్తుందన్నారు. దాన్ని హోదాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా సద్వినియోగం చేసుకోని మంచి కొరకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితువు పలికారు. ప్రవాసీయులందరు కృషివలులని ఆయన కొనియాడారు. సదుద్దేశ్యం ఉంటే పకృతి కూడా సహకరిస్తుందని ఆయన అన్నారు.

JD.jpg

వ్యక్తిత్వ వికాసం మనిషి ఎదుగుదలకు ముఖ్యమని చెబుతూ పురాణాలను, శ్లోకాలను లక్ష్మీనారాయణ ఉటంకించారు. పెరుగుతున్న సామాజిక మాధ్యమాలలో అదే విధంగా పెరుగుతున్న తప్పుడు కథనాలు, వార్తలు ఇబ్బంది కల్గిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇటీవల తాను చదివిన పాఠశాలలో ఒక కార్యక్రమం ఉంటే వెళ్ళానని, అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు పాఠశాలకు సంబంధించిన కార్యక్రమం ఉంటే దానికి ఆహ్వనిస్తే వెళ్ళానని అంత మాత్రన తనను ఆ పార్టీలో చేరుతున్నట్లుగా పుకార్లు పుట్టించారని ఆయన ఆక్షేపించారు. వాజ్ పేయి ఇందిరా, రాజీవ్ గాంధీలను ప్రశంసించారని అంత మాత్రాన ఆయన కాంగ్రేస్‌లో చేరారా? అని ఆయన ప్రశ్నించారు. విదేశాలలో ఉన్నా కూడా మాతృభూమి సేవలో భావితరాలను ఆదర్శవంతంగా తీర్చదిద్దడానికి బహ్రెయిన్‌లోని ప్రేరణ బృందం చేస్తున్న కృషిని మాజీ సీబీబిఐ అధికారి ప్రశంసించారు. నవీన్, కిరణ్, వాసు, యుగంధర్, రాజశేఖర్, సుబ్రమణ్యం, రఘునాథబాబు, వెంకటస్వామి లు ప్రేరణ బృందంలో ఉన్నారు. భారత్ మరియు బహ్రెయిన్ దేశాల మధ్య చారిత్ర్మాక సంబంధాలను విశిష్ఠ అతిథిగా పాల్గొన్న బహ్రెయిన్ రాజవంశానికి చెందిన షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా వివరించారు. బహ్రెయిన్ నవనిర్మాణంలో భారతీయుల పాత్రను ఆయన ప్రశంసించారు.

JDDDD.jpg

బహ్రెయిన్ దేశంలోనూ తాము అభినందనీయమైన ఆదర్శప్రాయంగా సేవలందించే స్ధితిలో ఉండడానికి మాతృభూమిలో తమకు లభించిన విద్యబుద్ధులు, సంస్కారం అని తెలుగు ప్రవాసీ ప్రముఖుడు కోటగిరి నవీన్ కుమార్ వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించే విధంగా, వృత్తిపరంగా నిబద్దతతో పని చేసే విదేశీయులందరిలోనూ ఎడారినాట భారతీయులు అగ్రగణ్యులని నవీన్ కుమార్ పేర్కొన్నారు. అత్యంత ఉత్సహాంగా జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్ మురళీధర్ మరియు శరత్ చంద్ర జంటల సాంస్కృతిక ప్రదర్శనలు మరియు చిన్నారులు సంహిత, హిమా శ్రీ, లిఖిత శ్రీ, హారికల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి.

Updated Date - 2023-11-16T06:37:08+05:30 IST