ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Arya Medical University: కాలిఫోర్నియాలో ఆర్య వైద్య కళాశాలకు శంఖుస్థాపన

ABN, Publish Date - Sep 24 , 2025 | 08:20 AM

ఈ ప్రాజెక్ట్‌కు సాన్ వాకిన్ కౌంటీ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చింది. సాన్ వాకిన్ కౌంటీ 30 సంవత్సరాలకు గాను సంవత్సరానికి కేవలం ఒక డాలరు ఫీజుతో భవనాన్ని లీజుకు ఇస్తోంది.

Arya Medical University

ఉత్తర కాలిఫోర్నియాలోని సాన్ వాకిన్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఆర్య వైద్య విశ్వవిద్యాలయ (AUSOM) భవన నిర్మాణానికి మంగళవారం నాడు శంఖుస్థాపన జరిగింది. భారత కౌన్సిల్ జనరల్ డాక్టర్ శ్రీకర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికన్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ప్రవాస భారతీయులు.. మరీ ముఖ్యంగా ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఆర్య వైద్య యూనివర్శిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ.. తమ విశ్వవిద్యాలయానికి డబ్ల్యూఏఎస్సీ గుర్తింపు ఉందని తెలిపారు.

కాలిఫోర్నియాలో తీవ్రమైన వైద్య నిపుణుల కొరత ఉందని, దాన్ని అధిగమించేందుకు తమ విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని అన్నారు. ఉత్తర కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ తర్వాత లాభాపేక్ష లేని రెండో వైద్య కళాశాలగా ఆర్య భాసిల్లుతుందన్నారు. ఒక దశాబ్దానికి పైగా ప్రయత్నం, వేలాది గంటల శ్రమ, మిలియన్ల డాలర్ల ఖర్చు తర్వాత నేటి కార్యక్రమానికి చేరుకున్నామని ఆనంద్ తెలిపారు. 1923లో నిర్మించిన పురాతన భవనాన్ని ఆర్య విశ్వవిద్యాలయం కోసం పునరుద్ధరించనున్నట్లు యూనివర్సిటీ అధ్యక్షుడు ప్రభాకర్ కల్వచర్ల పేర్కొన్నారు.

ఇక, ఈ ప్రాజెక్ట్‌కు సాన్ వాకిన్ కౌంటీ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చింది. సాన్ వాకిన్ కౌంటీ 30 సంవత్సరాలకు గాను సంవత్సరానికి కేవలం ఒక డాలరు ఫీజుతో భవనాన్ని లీజుకు ఇస్తోంది. ఆర్య యూనివర్సిటీ సీఈఓ రాజు చమర్తి, కౌంటీ బోర్డ్ ఛైర్ పాల్ కనెపా, ఎస్‌జేజీహెచ్ సీఈఓ రిక్ కాస్ట్రో, సీఎమ్ఓ డాక్టర్ షీలా కాప్రే, డాక్టర్ బాబ్ సస్కిండ్, డాక్టర్ ఆల్ఫ్రెడ్ టెనోర్, టెరి వర్క్‌మన్‌, డా. హనిమిరెడ్డి, డా. రఘురెడ్డి, స్టాక్టన్ మేయర్ క్రిస్టినా, దేవేందర్ నరాల, ఎల్వా స్పార్ట్లింగ్, వెంకట్ గుడివాడ, మమత కూచిభొట్ల, ప్రియ తనుగుల, మీనాక్షి గణేశన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హెల్త్ ప్లాన్ సాన్ వాకిన్ నుంచి 17 కోట్ల రూపాయల గ్రాంట్.. డా. హెన్రీ వాంగ్ నుంచి 8.5 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. ఈ వైద్య కళాశాలను వచ్చే రెండేళ్లలో ప్రారంభించాలనే లక్ష్యంగా నిర్మాణ పనులను ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్‌మెన్ జోష్ హార్డర్, స్టేట్ సెనేటర్ జెర్రీ మెక్నెర్నీ, అసెంబ్లీ వుమెన్ రొడెషియా రాన్సమ్ కార్యాలయాల నుండి వైద్య కళాశాకు గుర్తింపు పత్రాలు సైతం అందాయి.

ఇవి కూడా చదవండి

బస్సులో అలజడి.. సుత్తెతో ప్రయాణికులపై దాడి చేసిన సైకో..

మళ్లీ అదే పాట.. ఇండియా, పాక్ యుద్ధాన్ని వాడేసుకుంటున్న ట్రంప్..

Updated Date - Sep 24 , 2025 | 08:29 AM