Share News

Trump Claims India Pak Conflict: మళ్లీ అదే పాట.. ఇండియా, పాక్ యుద్ధాన్ని వాడేసుకుంటున్న ట్రంప్..

ABN , Publish Date - Sep 24 , 2025 | 06:55 AM

మే 10వ తేదీ నుంచి ట్రంప్ భారత్, పాక్ యుద్ధం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తానే యుద్ధాన్ని ఆపినట్లు చెప్పుకుంటున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి ట్రంప్ మాటల్ని కొట్టిపారేశారు.

Trump Claims India Pak Conflict: మళ్లీ అదే పాట.. ఇండియా, పాక్ యుద్ధాన్ని వాడేసుకుంటున్న ట్రంప్..
Trump Claims India Pak Conflict

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన తీసుకునే నిర్ణయాలు పక్క దేశాలను మాత్రమే కాకుండా అమెరికాను సైతం ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఏం జరిగినా ట్రంప్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. దెబ్బతిన్నా కూడా తనదే పైచెయ్యి అనుకుంటున్నారు. తన వల్లే ఈ ప్రపంచం నడుస్తోంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి తన కృషి ఎంతో ఉందని అంటున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా.. ఆ కార్యక్రమంలో తాను ఏడు యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్నారు.


మరీ ముఖ్యంగా ఇండియా, పాక్ యుద్ధం ప్రస్తావన తెస్తున్నారు. తాజాగా, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ జరిగింది. ఆ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేము ఏమీ చేయలేకపోతున్నామని వాళ్లు అన్నారు. ఓ యుద్దం 31 ఏళ్ల పాటు జరిగింది. మరో యుద్ధం 36 ఏళ్ల పాటు జరిగింది. వేల మంది ప్రాణాలను బలి తీసుకున్న ఏడు యుద్ధాలను నేను ఆపాను. ఇజ్రాయెల్, ఇరాన్.. ఇండియా, పాకిస్తాన్.. రువాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో..


థాయ్‌లాండ్,కాంబోడియా.. అర్మేనియా, అజర్‌జైజన్.. ఈజిప్ట్, ఇథియోపియా.. సెర్బియా, కోసోవో యుద్ధాలను ఆపాను. యూఎన్ మాత్రం సాయం చేయడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. స్థాయికి తగ్గట్టుగా ఏ మాత్రం కృషి చేయలేదు. వట్టి మాటలు మాత్రమే చెప్పింది. మాటలతో యుద్ధాలు ఆగవు’ అని అన్నారు. కాగా, మే 10వ తేదీ నుంచి ట్రంప్ భారత్, పాక్ యుద్ధం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తానే యుద్ధాన్ని ఆపినట్లు చెప్పుకుంటున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి ట్రంప్ మాటల్ని కొట్టిపారేశారు. తాము యుద్ధం ఆపడానికి ఏ దేశం కారణం కాదని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

విశాఖలో అపోలో జినోమిక్స్‌ ఇనిస్టిట్యూట్‌

సీఆర్‌పీఎఫ్‌కు సీఎస్ఆర్‌ 338 స్నైపర్‌ రైఫిల్స్‌

Updated Date - Sep 24 , 2025 | 07:09 AM