Share News

Indian Defence: సీఆర్‌పీఎఫ్‌కు సీఎస్ఆర్‌ 338 స్నైపర్‌ రైఫిల్స్‌

ABN , Publish Date - Sep 24 , 2025 | 06:43 AM

అబుదాబీకి చెందిన చిన్న ఆయుధాల డిజైనింగ్‌, తయారీ కంపెనీ కారకాల్‌, మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) అనుబంధ కంపెనీ...

Indian Defence: సీఆర్‌పీఎఫ్‌కు సీఎస్ఆర్‌ 338 స్నైపర్‌ రైఫిల్స్‌

  • ఐకామ్‌ టెలీకి భారీ ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అబుదాబీకి చెందిన చిన్న ఆయుధాల డిజైనింగ్‌, తయారీ కంపెనీ కారకాల్‌, మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) అనుబంధ కంపెనీ ఐకామ్‌ టెలీ లిమిటెడ్‌ సారథ్యంలోని జాయింట్‌ వెంచర్‌ కంపెనీకి కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ దళం (సీఆర్‌పీఎఫ్‌) నుంచి రైఫిళ్ల సరఫరా ఆర్డర్‌ లభించింది. ఈ ఆర్డర్‌ కింద 200.. సీఎస్ఆర్‌ 338 స్నైపర్‌ రైఫిళ్లు సీఆర్‌పీఎ్‌ఫకి సరఫరా చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని ఐకామ్‌ కారకాల్‌ స్మాల్‌ ఆర్మ్స్‌ కాంప్లెక్స్‌లో ఈ స్నైపర్‌ రైఫిళ్లు ఉత్పత్తి చేయనున్నట్టు ఎంఈఐఎల్‌ వెల్లడించింది. ఎడ్జ్‌ గ్రూప్‌ కంపెనీ అయిన కారకాల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే భారత సాయుధ దళాలు, కేంద్ర ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ సహా ఇతర రక్షణ విభాగాలకు ఆధునిక ఆయుధాల తయారీ, సరఫరా కోసం ఈ కాంప్లెక్స్‌ను ప్రారంభించింది. ఐకామ్‌ కారకాల్‌ స్మాల్‌ ఆర్మ్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన అనంతరం ఐకామ్‌తో భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటున్నట్టు కారకాల్‌ సీఈఓ హమద్‌ అలామెరి చెప్పారు.

తమ ప్రయాణంలో ఇది ఒక మైలురాయి అని ఐకామ్‌ డైరెక్టర్‌ సుమంత్‌ పాటూరు అన్నారు. తాము సీఆర్‌పీఎ్‌ఫకు అత్యంత ఆధునికమైన సీఎ్‌సఆర్‌-338 స్నైపర్‌ రైఫిళ్లు సరఫరా చేయడంతో పాటు ప్రపంచ శ్రేణి టెక్నాలజీని కూడా బదిలీ చేస్తున్నామని, తద్వారా హైదరాబాద్‌ తయారీ రంగంలో అత్యున్నత నాణ్యత గల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో దేశంలో తయారైన తొలి హై పెర్ఫార్మెన్స్‌ బోల్ట్‌ యాక్షన్‌ సీఎస్ఆర్‌ 338 స్నైపర్‌ రైఫిల్‌ డెలివరీ చేయనున్నట్టు సుమంత్‌ తెలిపారు.

Updated Date - Sep 24 , 2025 | 06:45 AM