NRI: ఆప్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్స్
ABN, Publish Date - Aug 20 , 2025 | 09:34 AM
యూఎస్‌లోని అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సేవా రంగంలో దూసుకుపోతుంది. అందులో భాగంగా అమెరికాలోని వివిధ నగరాలలో ఆప్త, అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి.
డెట్రాయిట్: యూఎస్‌లోని అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. సేవా రంగంలో దూసుకుపోతుంది. అందులో భాగంగా అమెరికాలోని వివిధ నగరాలలో ఆప్త, అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్ఫూర్తితో ప్రారంభమైన ఈ రక్తదాన శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది. ఆ క్రమంలో ఆగస్టు 17వ తేదీన డెట్రాయిట్ వేదికగా ఆప్త మెగా బ్లడ్ కమిటీ వైస్ చైర్మన్ సునీల్ నల్లాల, ఆప్త జాయింట్ సెక్రటరీ సప్తగిరిష్ ఇండుగుల, టాలెంట్ సెర్చ్ చైర్ కళ్యాణ్ పోలసి,స్టేట్ కో ఆర్డినేటర్ కిషోర్ గుద్దటి, మెంబర్షిప్ చైర్మన్ శ్రీనివాస్ మత్తి ఆధ్వర్యంలో డెట్రాయిట్ వేదికగా రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్త దాన శిబిరాలు ఆగస్టు 23వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రక్తదాన శిబిరాలు నిర్వహించే ప్రదేశాల జాబితాను ఈ సందర్భంగా ఆప్త విడుదల చేసింది.
ఆగస్టు 17వ తేదీ మిచ్‌గన్
ఆగస్టు 17వ తేదీ న్యూజెర్సీ
ఆగస్టు 17వ తేదీ Raleigh
ఆగస్టు 16వ తేదీ ఆస్టిన్
ఆగస్టు 16వ తేదీ మిన్నెసోట
ఆగస్టు 23వ తేదీ సియాటిల్
ఆగస్టు 22వ తేదీ కొలంబస్
ఆగస్టు 23వ తేదీ చికాకూ
ఆగస్టు 23వ తేదీ కాలిఫోర్నియా
ఆగస్టు 23వ తేదీ డల్లాస్ రెండు ప్రాంతాల్లో ఈ శిబిరాలు నిర్వహిస్తారు.
Updated Date - Aug 20 , 2025 | 09:38 AM