Winter Eye Care Tips: కళ్లను కాపాడుకుందాం..
ABN, Publish Date - Dec 29 , 2025 | 06:44 AM
శీతాకాలంలో చలిగాలుల వల్ల కళ్లలో దురద, మంటతోపాటు కళ్లు ఎరుపెక్కడం, చూపు మసకబారడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలను నివారించే చిట్కాలు ఇవే...
శీతాకాలంలో చలిగాలుల వల్ల కళ్లలో దురద, మంటతోపాటు కళ్లు ఎరుపెక్కడం, చూపు మసకబారడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలను నివారించే చిట్కాలు ఇవే...
ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఫ్రీ రాడికల్స్ వచ్చే కంటి శుక్లాల సమస్య తగ్గుతుంది. దీనిలోని సి విటమిన్.. చూపు మసకబారడాన్ని ఆపుతుంది. తరచూ కేరట్ తినడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దీనిలోని ఎ విటమిన్ రేచీకటిని అరికడుతుంది.
పాలకూర, తోటకూర, పొన్నగంటి కూరలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పెద్దవారిలో ఎదురయ్యే కంటి సమస్యలు తగ్గుతాయి. కళ్ల నుంచి అకారణంగా నీళ్లు కారడం, కళ్లు పొడిబారడం నుంచి ఉపశమనం కలుగుతుంది.
బాదం పప్పుతోపాటు సాల్మన్, మాకెరెలా, ట్యూనా లాంటి చేపలను ఆహారంగా తీసుకుంటే వాటిలోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ప్రభావవంతంగా పనిచేసి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
చలికాలంలో ఎక్కువగా లభించే నరింజ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, అనాస పండ్లను తినడం వల్ల కళ్లకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కళ్లు కాంతివంతంగా మారతాయి. కోడిగుడ్లు, టమాటాలను తీసుకోవడం వల్ల వయసు పెరగడం వల్ల మందగించే కంటి చూపు మెరుగుపడుతుంది.
ఇవి కూడా చదవండి
వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..
బురదలో ఆహారం కోసం వెతుకుతున్న చిరుత.. చివరకు ముందున్న దృశ్యం చూసి..
Updated Date - Dec 29 , 2025 | 06:44 AM