ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Precautions for Liver Health: కామెర్ల మూలాలు కనిపెట్టాలి

ABN, Publish Date - Nov 20 , 2025 | 05:38 AM

డాక్టర్‌! కామెర్లు వస్తే పత్యం ఉండాలంటారు. కానీ ఇది చికిత్స కాదు కదా? కాలేయం దెబ్బతిన్నప్పుడు చికిత్సకు బదులుగా పత్యం ఉండడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? అసలు కామెర్లు ఎందుకొస్తాయి...

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! కామెర్లు వస్తే పత్యం ఉండాలంటారు. కానీ ఇది చికిత్స కాదు కదా? కాలేయం దెబ్బతిన్నప్పుడు చికిత్సకు బదులుగా పత్యం ఉండడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? అసలు కామెర్లు ఎందుకొస్తాయి?

ఓ సోదరి,హైదరాబాద్‌

కామెర్లు రుగ్మత కాదు. అదొక వ్యాధి లక్షణం. వ్యాధి మూలంగా కాలేయం అనారోగ్యంపాలైతే కామెర్ల లక్షణాలు బయల్పడతాయి. అలాంటప్పుడు కాలేయానికి ఏమై ఉంటుంది? ఎలాంటి ఇబ్బందికి గురై ఉంటుంది? అనేది తెలుసుకోవాలి. కాలేయానికి సోకే రుగ్మతల్లో ప్రధానమైనవి... హెపటైటిస్‌ ఎ, బి, సి, ఇ!

హెపటైటిస్‌ ఎ, ఇ: హెపటైటిస్‌ ఎ, ఇలు కలుషిత ఆహారం, అపరిశుభ్ర పరిసరాల ద్వారా సోకుతాయి. ఈ రకం వైర్‌సల జీవితకాలం 14 రోజులే! కాబట్టి, ఈ వైర్‌సల కారణంగా కాలేయం జబ్బుపడి, కామెర్లు సోకినా అది తాత్కాలికమే! 6 నుంచి 8 వారాల పాటు తేలికపాటి ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే పరిస్థితి చక్కబడుతుంది.

హెపటైటిస్‌ బి, సి: ఇవి ప్రమాదకరమైన వైర్‌సల కారణంగా సోకుతాయి. రక్తప్రవాహం ద్వారా కాలేయానికి వైరస్‌ సోకగానే లక్షణాలు మొదలవుతాయి. లక్షణాలు కామెర్లను పోలినట్టే ఉన్నా, సమర్థమైన చికిత్స అందకపోతే, క్రమేపీ కాలేయాన్ని నాశనం చేస్తాయి. టూకీగా చెప్పాలంటే హెపటైటిస్‌ బి వైర్‌సలు కాలేయ కణాల్లోకి చొరబడి వాటి డిఎన్‌ఎల స్థానాల్ని ఆక్రమిస్తాయి. హెపటైటిస్‌ సి వైరస్‌ కూడా కాలేయ కణాల్ని పాడు చేస్తుంది. ఆ క్రమంలో కాలేయం ఫైబ్రోసిస్‌, సిర్రోసిస్‌, లివర్‌ ఫెయిల్యూర్‌, లివర్‌ క్యాన్సర్‌... ఇలా ఒక్కో దశ దాటుకుంటూ చివరకు ప్రాణాంతక స్థితికి చేరుస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రమాదకర వైర్‌సలు సోకే వీలున్న మార్గాలన్నిటినీ మూసేయాలి. అదెలాగంటే....

శరీర ద్రవాలు: హెపటైటిస్‌ బి, సి వైర్‌సలు కలిగిన వ్యక్తులను లైంగికంగా కలవకూడదు రక్తమార్పిడి: రక్తం ఇచ్చినా, తీసుకున్నా సిరంజీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి

ఇంజెక్షన్లు: తీసుకునే ప్రతి ఇంజెక్షన్‌ కొత్తదై ఉండాలి

  • బ్యూటీ పార్లర్‌లో వాడే సౌందర్య పరికరాల వల్ల కూడా సోకవచ్చు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

  • సెలూన్లలో వాడే రేజర్ల వల్ల కూడా ఈ వైర్‌సలు సోకుతాయి. కాబట్టి సొంత రేజర్‌ తీసుకెళ్లాలి

ఇన్ని మార్గాల్లో ఇన్ని రకాల హెపటైటిస్‌ వైర్‌సలు సోకే ప్రమాదం ఉంది కామెర్లను నిర్లక్ష్యం చేయకూడదు. కాలేయం జబ్బు పడకుండా ఉండాలంటే, తగిన జాగ్రత్తలు పాటిస్తూ, పరీక్షలతో సోకిన వైరస్‌ రకాన్ని కనిపెట్టి, వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి.

డాక్టర్‌ ఆశా ఎమ్‌.సుబ్బలక్ష్మి

గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్‌ లివర్‌ డిసీసెస్‌ స్పెషలిస్ట్‌,

హైదరాబాద్‌.

ఇవీ చదవండి:

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Updated Date - Nov 20 , 2025 | 05:38 AM