Toxic Metals Found in Popular Lipsticks: లిప్‌స్టిక్‌లో విషాలు
ABN, Publish Date - Nov 18 , 2025 | 04:58 AM
కొన్ని ప్రముఖ లిప్‌స్టిక్స్, లిప్‌గ్లా్‌సల్లో ఆరోగ్యాన్ని దెబ్బతీసే మోతాదుల్లో విషపూరిత లోహాలు ఉంటున్నట్టు యుసి బెర్క్లీ అధ్యయనంలో వెల్లడైంది. లిప్‌స్టిక్స్, లిప్‌గ్లా్‌సల్లో సీసం, క్యాడ్మియం, క్రోమియం, అల్యూమినియం...
మీకు తెలుసా?
కొన్ని ప్రముఖ లిప్‌స్టిక్స్, లిప్‌గ్లా్‌సల్లో ఆరోగ్యాన్ని దెబ్బతీసే మోతాదుల్లో విషపూరిత లోహాలు ఉంటున్నట్టు యుసి బెర్క్లీ అధ్యయనంలో వెల్లడైంది. లిప్‌స్టిక్స్, లిప్‌గ్లా్‌సల్లో సీసం, క్యాడ్మియం, క్రోమియం, అల్యూమినియం ఇతరత్రా లోహాల అవశేషాలు ఎక్కువ మోతాదుల్లో ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఎంతో అరుదుగా ఈ సౌందర్య సాధనాలను వాడేవారితో పోలిస్తే, తరచూ వీటి మీద ఆధారపడేవారిలో క్యానర్ కారకమైన క్రోమియం, నాడీ వ్యవస్థను దెబ్బతీసే మాంగనీసు ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటికి పదే పదే బహిర్గతమవడం మూలంగా నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. 24 ప్రముఖ లిప్‌స్టిక్స్‌లో సీసం, నిర్దేశిత మోతాదులకు మించి ఎంతో ఎక్కువగా ఉంటుందనీ, ఈ లిప్‌స్టిక్స్‌ను మరీ ముఖ్యంగా పిల్లలు ఉపయోగించడం వల్ల వారికి ముప్పు కూడా అంతే ఎక్కువగా ఉంటుందనీ శాస్త్రవేత్తలు అంటున్నారు. యూరోపియన్ యూనియన్, ఇలాంటి లిప్‌స్టిక్స్ మీద నిషేధం విధించింది. ఇదే తరహా ప్రమాణాలను ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావడం మంచిదనీ, లిప్‌స్టిక్ లాంటి సౌందర్య సాధనాలను క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉందనీ యుసి బెర్క్లీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..
Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Updated Date - Nov 18 , 2025 | 04:58 AM