Share News

Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..

ABN , Publish Date - Nov 17 , 2025 | 05:21 PM

వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్​ టెక్నీషియన్​ గ్రేడ్​ - II పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

Lab Technician Grade 2 Results: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు విడుదల..

హైదరాబాద్, నవంబర్ 17: వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్​ టెక్నీషియన్​ గ్రేడ్​ - II పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఈ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా విడుదల చేశారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TG MHSRB) తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచింది. ఈ ఉద్యోగాలకు పరీక్ష రాసిన అభ్యర్థులు ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.


తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,284 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా.. 24,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్షను 2024, నవంబర్ 10వ తేదీన నిర్వహించారు. మొత్తం 23,323 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. మెరిట్ లిస్ట్ సిద్ధం చేసి.. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసిన ప్రభుత్వం.. తాజాగా ఫైనల్ మెరిట్ లిస్ట్‌(ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితా)ను విడుదల చేసింది. కొత్తగా ఎంపికైన అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమించనున్నారు.

ఇవి కూడా చదవండి

విశాఖ ఉక్కుపై ప్రభుత్వం కీలక ప్రకటన

సూర్యునికి అర్ఘ్యం ఎందుకు? ఎలా? సమర్పించాలి.. అందువల్ల ఫలితాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 17 , 2025 | 05:22 PM