Share News

Arghya To Sun Benefits: సూర్యునికి అర్ఘ్యం ఎందుకు? ఎలా? సమర్పించాలి.. అందువల్ల ఫలితాలు

ABN , Publish Date - Nov 17 , 2025 | 03:25 PM

ప్రతి రోజు తెల్లవారుజామున ప్రభాత సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారు. అలా ఎందుకు చేయాలి. అలా చేయడం వల్ల కలిగే లాభమేమిటి? ఎలాంటి ఫలితం ఉంటుందంటే..?

Arghya To Sun Benefits: సూర్యునికి అర్ఘ్యం ఎందుకు? ఎలా? సమర్పించాలి.. అందువల్ల ఫలితాలు

ప్రతిరోజూ ఉదయాన్నే స్నానమాచరించిన తర్వాత ప్రత్యక్ష భగవానుడు సూర్యుడికి కొందరు అర్ఘ్యం సమర్పిస్తుంటారు. ఏదైనా పాత్ర నిండా నీటిని తీసుకుని సూర్యుడి ఎదురుగా నిలబడి.. ధారలా నీటిని కిందికి వదులుతారు. ఎన్నో శతాబ్దాలుగా ఈ సంప్రదాయం వస్తుంది. ఇలా చేయడం వెనుక అనేక ఆరోగ్య రహస్యాలు దాగున్నాయని పండితులు చెబుతున్నారు.


ఇలా అర్ఘ్యం సమర్పిస్తున్నప్పుడు ఆ నీటి ద్వారా సూర్యుడి లేలేత కిరణాలు మన కళ్లతోపాటు శరీరంపైనా పడతాయి. తద్వారా కంటిచూపు మెరుగుపడుతుందని చెబుతారు. అర్ఘ్యం అర్పిస్తూ కాసేపైనా సూర్యుడి ఎదురుగా నిలబడి ఉండడం వల్ల శరీరానికి విటమిన్ డి సమృద్ధిగా అందుతుందని పేర్కొంటారు.


ఇంకా వివరంగా చెప్పాలంటే.. సూర్యుడి నుంచి అందే ప్రాణశక్తితోపాటు వెలుగునూ నిత్యం సమస్త ప్రాణ కోటి ఉపయోగించుకుంటుంది. అందుకు కృతజ్ఞతగానే ప్రత్యక్ష నారాయణుడికి అర్ఘ్యం సమర్పించే ఆచారం వచ్చిందంటారు. అంతేకాదు.. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక స్పష్టత పెరుగుతుంది. ఆధ్యాత్మిక క్రమశిక్షణ వృద్ధి చెందుతుందని కూడా వివరిస్తున్నారు.


Surya-water.jpgఅర్ఘ్యానికి ఏ పాత్ర ఉపయోగించాలి..

సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడానికి రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలి. అదీకాక హిందూ పురాణాల ప్రకారం రాగి స్వచ్ఛమైనది. గౌరవం, భక్తికి ప్రతీకగా రాగి పాత్రను స్వామి వారి అర్ఘ్యానికి వినియోగించాలి.


అర్ఘ్యం సమర్పించేటప్పుడు..

సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు.. నీటిలో పువ్వులు, బియ్యం వేయాలి. ఇవి ప్రత్యక్ష నారాయణుడికి గౌరవాన్ని సూచిస్తాయి.


ఏ విధంగా చేయాలి..

సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో.. ఆయన కిరణాలు మీ ముందు నీటిలో ప్రతిబింబించాలి. ఇది దైవిక కాంతిని సూచిస్తుంది.

ఈ సమయంలో తూర్పు ముఖంగా నిలబడి చేయాల్సి ఉంటుంది. ఆయన తూర్పున ఉదయిస్తాడు. ఇక మీరు వదిలే ఈ అర్ఘ్యం నీరు.. మీ పాదాలకు తగలకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ.. ఆ నీరు మీ పాదాలను తాకితే.. ఆ భగవంతుడిని అగౌరవ పరిచినట్లు అవుతుంది.


అర్ఘ్యం సమర్పించే సమయంలో జపించాల్సిన మంత్రాలు..

గాయత్రీ మంత్రం..

‘ఓం భూర్ భువ: స్వా: తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న: ప్రచోదయాత్’’ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే సమయంలో ఈ మంత్రాన్ని నిత్యం స్మరించాల్సి ఉంటుంది.

ఓం సూర్యాయ నమ:

ఈ సరళమైన మంత్రం సూర్యుడిని ప్రశంసించేందుకు ఉపయోగపడుతుంది.

సూర్య బీజ మంత్రం..

ఓం హ్రం హ్రీం హ్రౌం స: సూర్యాయ నమ:

ఈ మంత్రం సూర్యుడి సానుకూల ప్రభావాన్ని కోరుతూ నేరుగా సంబోధిస్తుంది.


సూర్య భగవానుడి నామాలు..

ఓం మిత్రాయ నమ:

ఓం రవాయే నమ:

ఓం సూర్యాయ నమ:

ఓం భానవే నమ:

ఓం ఖగాయే నమ:

ఓం పుష్ణే నమ:

ఓం హిరణ్యగర్భాయ నమ:

ఓం మరీచయే నమ:

ఓం ఆదిత్యాయ నమ:

ఓం సావిత్రే నమ:

ఓం అర్కాయ నమ:

ఓం భాస్కరాయ నమ:

ఈ వార్తలు కూడా చదవండి..

ఘోరం.. ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్

ఎమ్మార్వో ఆఫీస్‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టిన ఆకతాయి..

For More Devotional News And Telugu News

Updated Date - Nov 17 , 2025 | 06:00 PM