Giddalur Tahsildar Office: ఎమ్మార్వో ఆఫీస్‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టిన ఆకతాయి..
ABN , Publish Date - Nov 17 , 2025 | 02:06 PM
ప్రకాశం జిల్లాలో విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి . గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. అది కూడా కేవలం 20 వేల రూపాయలకే ఎమ్మార్వో ఆఫీస్ అమ్ముతానంటూ పోస్టు పెట్టాడు.
సాధారణంగా జనం సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మడానికి, కొనడానికి ‘ఓఎల్ఎక్స్’ను వాడుతూ ఉంటారు. చిన్న చిన్న వస్తువుల దగ్గరినుంచి భారీ స్థలాల వరకు అన్ని రకాల వాటిని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి వస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఓఎల్ఎక్స్‌లో వింత విచిత్రమైన వస్తువులు కూడా అమ్మకానికి ఉంటాయి. వాటిని చూసినపుడు ‘ఇలాంటి వాటిని కూడా అమ్మకానికి పెడతారా?’ అని అనిపిస్తూ ఉంటుంది. ప్రకాశం జిల్లాలో షాక్‌తో పాటు మనల్ని షేక్ చేసే సంఘటన ఒకటి వెలుగు చూసింది.
ఓ ఆకతాయి రెచ్చిపోయి ప్రవర్తించాడు. గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. అది కూడా కేవలం 20 వేల రూపాయలకే ఎమ్మార్వో ఆఫీస్ అమ్ముతానంటూ పోస్టు పెట్టాడు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్టు వైరల్‌గా మారింది. గిద్దలూరు ఎమ్మార్వో దృష్టికి కూడా విషయం వెళ్లింది. ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఎమ్మార్వో ఆఫీస్‌ను ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టడంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
గ్యాస్ స్టవ్ లేకపోతేనేం.. ఒక వ్యక్తి టీ ఎలా పెడుతున్నాడో చూడండి..