chai viral video: గ్యాస్ స్టవ్ లేకపోతేనేం.. ఒక వ్యక్తి టీ ఎలా పెడుతున్నాడో చూడండి..
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:59 PM
తలనొప్పి వచ్చినా, టైమ్ పాస్ కోసమైనా, స్నేహితులతో కలిసినా.. ఇలా ఏ సందర్భంలోనైనా టీ తాగడం తప్పనిసరి. అయితే టీ తయారు చేయాలంటే గ్యాస్ స్టవ్ ఉండాలి. అయితే ఒక వ్యక్తి వెరైటీగా టీ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
భారతదేశంలో, టీ అనేది కేవలం ఒక పానీయం కాదు.. అది ఒక ఉద్వేగం. ఉదయం లేచిన దగ్గర్నుంచి పలుసార్లు టీ తాగే వారు మన దేశంలో కోకొల్లలు. తలనొప్పి వచ్చినా, టైమ్ పాస్ కోసమైనా, స్నేహితులతో కలిసినా.. ఇలా ఏ సందర్భంలోనైనా టీ తాగడం తప్పనిసరి. అయితే టీ తయారు చేయాలంటే గ్యాస్ స్టవ్ ఉండాలి. అయితే ఒక వ్యక్తి వెరైటీగా టీ తయారు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (unique chai making).
foodcravingspoint అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వ్యక్తి గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ మీద టీ కాస్తున్నాడు. ఐరన్ బాక్స్‌ను ఆన్ చేసి దానిపై గిన్నె పెట్టి పాలు, టీ పౌడర్, పంచదార వేసి మరిగిస్తున్నాడు. టీ మరుగుతుండగానే దానిని చక్కగా ఆస్వాదిస్తున్నాడు. ఈ జుగాడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు (chai chai trend).
ఈ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు (chai making trick). వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, టీ తయారు చేసుకోవాలని ఒకరు కామెంట్ చేశారు. 'ధన్యవాదాలు, ఇప్పుడు హోటల్‌లో టీ తయారు చేయడం గురించి ఇక టెన్షన్ ఉండదు' అని మరొకరు పేర్కొన్నారు. 'ఇండియన్ జుగాడ్ టెక్నాలజీ' అని మరొకరు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి
మెక్సికోలో జెన్-జెడ్ నిరసనలు.. హింసాత్మక దాడుల్లో 120 మందికి గాయాలు..