Mexico City protests: మెక్సికోలో జెన్-జెడ్ నిరసనలు.. హింసాత్మక దాడుల్లో 120 మందికి గాయాలు..
ABN , Publish Date - Nov 17 , 2025 | 08:00 AM
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా వేలాది మంది మెక్సికో యువకులు రోడ్ల మీదకు వచ్చి చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు తీవ్రంగా ప్రయత్నించారు.
కొద్ది రోజుల క్రితం నేపాల్‌ను కుదిపేసి ఏకంగా ప్రభుత్వాన్నే మార్చేసిన జెనరేషన్ జెడ్ నిరసనలు ఇప్పుడు మెక్సికోను తాకాయి. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా వేలాది మంది మెక్సికో యువకులు రోడ్ల మీదకు వచ్చి చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి (Mexico City protests).
నేరాలను, అవినీతిని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశాధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్ వెంటనే రాజీనామా చేయాలని జెన్-జెడ్ నిరసనకారులు డిమాండ్ చేశారు. అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు తీవ్రంగా ప్రయత్నించారు. భవనం చుట్టూ ఉన్న ఇనుప కంచెను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు (anti-crime protests Mexico).

నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది (Mexico City unrest). పోలీసులపై నిరసనకారులు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో మొత్తం 120 మంది గాయపడ్డారు. వారిలో వంద మంది పోలీసులే కావడం విచిత్రం. కాగా, ఈ నిరసనలను ఆపివేయించడానికి మెక్సికో ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
వెనక్కి తగ్గేది లేదు.. బీబీసీపై ట్రంప్ రూ.44 వేల కోట్ల దావా..
క్షమాపణలు చెప్పిన బీబీసీ.. డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి