ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tips to Stay Warm During Winter: చలికాలంలో వెచ్చగా ఇలా

ABN, Publish Date - Nov 20 , 2025 | 05:32 AM

చలికాలంలో వీచే చల్లని గాలుల వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి వణుకు పుడుతుంది. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు....

చలికాలంలో వీచే చల్లని గాలుల వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి వణుకు పుడుతుంది. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.

  • చలికాలంలో శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే మందపాటి దుస్తులు ధరించాలి. ఊలుతో తయారుచేసిన స్వెట్టర్లు వేసుకున్నా వెచ్చని అనుభూతి కల్గుతుంది.

  • చేతులకు గ్లౌజ్‌లు, పాదాలకు సాక్స్‌, తలకు క్యాప్‌ ధరించాలి. దీనివల్ల శరీరం ఉష్ణోగ్రతను కోల్పోకుండా వెచ్చగా ఉంటుంది.

  • వేడి వేడిగా కాఫీ, టీ, సూప్‌ తాగితే శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత పెరిగి వణుకు తగ్గుతుంది. దాహం అనిపించకపోయినా తరచూ గోరువెచ్చని నీరు తాగుతుంటే చలి నుంచి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్‌ సమస్యలు కూడా రావు.

  • అల్పాహారం, భోజనం, స్నాక్స్‌లను వేడిగా ఉన్నప్పుడే తినాలి. దీనివల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది.

  • చలిగా ఉందంటూ ముడుచుకుని పడుకుంటే కండరాలు పట్టేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే శరీరంలో రక్తప్రసరణ వేగం పెరిగి వేడి ఉత్పత్తి అవుతుంది. దీంతో వణుకు తగ్గి వెచ్చగా, ఉత్సాహంగా అనిపిస్తుంది.

  • చలికాలంలో రోజూ ఉదయం పూట ఎండలో కాసేపు నడిస్తే శరీరం తగినంత వేడిని గ్రహిస్తుంది. అలాగే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తూ ఉంటే శరీరం వెచ్చగా ఉంటుంది.

  • శీతాకాలంలో రోజూ తినే ఆహారంలో పసుపు, అల్లం, దాల్చినచెక్క, మిరియాలు లాంటి మసాలా దినుసులు చేర్చుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరిగి వణుకు తగ్గుతుంది.

ఇవీ చదవండి:

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Updated Date - Nov 20 , 2025 | 05:32 AM