Peplum Tops Fashion: పసందైన పెప్లమ్
ABN, Publish Date - Dec 17 , 2025 | 01:20 AM
జీన్స్‌తో కలిపి ధరించే టాప్స్‌లో పెప్లమ్ టాప్స్ ప్రత్యేకంగా ఉంటాయి. రొటీన్‌కు భిన్నంగా కనిపించాలనుకునే మహిళలు తప్పనిసరిగా...
ఫ్యాషన్
జీన్స్‌తో కలిపి ధరించే టాప్స్‌లో పెప్లమ్ టాప్స్ ప్రత్యేకంగా ఉంటాయి. రొటీన్‌కు భిన్నంగా కనిపించాలనుకునే మహిళలు తప్పనిసరిగా ఎంచుకోవలసిన టాప్స్ ఇవి. దుస్తులకు వినూత్నమైన ఆకర్షణను తెచ్చిపెట్టే ఈ కుచ్చుల టాప్స్ మీకోసం...
నడుము దగ్గర కనిపించే కుచ్చుల వల్ల ఎబ్బెట్టుగా కనిపిస్తామేమోననే భయం అవసరం లేదు. నిజానికి పెప్లమ్ శరీర సౌష్టవాన్ని ఇంపుగా కనిపించేలా చేస్తుంది. అవర్ గ్లాస్ శరీరాకృతిని కోరుకుకునేవారు ఈ తరహా టాప్స్‌ను నిస్సందేహంగా ఎంచుకోవచ్చు.
పెప్లమ్ టాప్స్‌ను లెహంగాతో కూడా కలిపి వేసుకోవచ్చు. అయితే నడుముకు బెల్ట్, మెడకు చున్నీ తప్పనిసరి. ధరించే లెహెంగాను బట్టి యాక్సెసరీస్ ఎంచుకోవాలి. డ్రెస్ భారీగా ఉంటే ఆభరణాలు సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. హైహీల్స్ తప్పక ధరించాలి.
సెక్విన్, శాటిన్, గోల్డ్ వర్క్, నెట్... ఎలాంటి మెటీరియల్ అయినా పెప్లమ్ స్టైల్‌కు చక్కగా సూటవుతుంది. వేడుకలకు తగినట్టుగా సందర్భానుసారంగా తయారవాలనుకుంటే అందుకు తగినంత హెవీగా పెప్లమ్ టాప్ ఎంచుకుంటే సరిపోతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
For More AP News And Telugu News
Updated Date - Dec 17 , 2025 | 01:20 AM