ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Home Remedies for Dandruff: చుండ్రు చికాకు పెడుతోందా

ABN, Publish Date - Nov 05 , 2025 | 01:05 AM

శీతాకాలంలో బాగా చికాకు పుట్టించే సమస్య చుండ్రు. చలి గాలి, తేమ తక్కువగా ఉండడం తదితర కారణాలవల్ల తలపై చర్మం పొడిబారుతుంది. దీంతో పొలుసులు వచ్చి, దురద...

జీవనశైలి

శీతాకాలంలో బాగా చికాకు పుట్టించే సమస్య చుండ్రు. చలి గాలి, తేమ తక్కువగా ఉండడం తదితర కారణాలవల్ల తలపై చర్మం పొడిబారుతుంది. దీంతో పొలుసులు వచ్చి, దురద మొదలవుతుంది. అయితే చిన్న చిన్న చిట్కాలతో దీని నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు.

హైడ్రేటింగ్‌ షాంపూ: ఇది పొడిబారిన చర్మంపై తేమను పునరుద్ధరించడానికి దోహదపడుతుంది. ఈ షాంపూల్లో ఉపయోగించే కలబంద, కొబ్బరి పాలు, గ్లిజరిన్‌ లాంటివి తలపై చర్మానికి పోషకాలు అందించి సమతుల్యతను కాపాడతాయి. అయితే సల్ఫేట్‌, ఆల్కహాల్‌తో కూడిన షాంపూలకు దూరంగా ఉండండి. ఇవి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.

నూనెతో మర్దన: తలకు తరచూ నూనె పెట్టుకోవడం అమ్మమ్మల కాలం నుంచి అనుసరిస్తున్నదే అయినా... చుండ్రును నివారించడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. ముఖ్యంగా చలి కాలంలో. కొబ్బరి నూనె లేదా ఆలివ్‌, ఆల్మండ్‌ తదితర సహజసిద్ధమైన నూనెలు తలకు తేమను అందిస్తాయి. చర్మాన్ని పొడిబారకుండా రక్షిస్తాయి. తలకు నూనె పట్టించి, వేళ్లతో సున్నితంగా మర్దన చేస్తే... కుదుళ్ల వరకు చేరి, రక్త ప్రసరణను మెరుగవుతుంది. కనీసం అరగంట తరువాత లేదంటే రాత్రి పడుకొనే ముందు రాసుకొని తెల్లారి షాంపూతో స్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

గోరువెచ్చటి నీరు: చలి కాలంలో వేడినీళ్ల స్నానం హాయిగా అనిపిస్తుంది. కానీ బాగా వేడిగా ఉన్న నీటితో తల స్నానం చేస్తే చర్మం మరింత పొడిబారుతుంది. మాడులోని సహజసిద్ధమైన తేమను తగ్గిస్తుంది. చుండ్రు రావడానికి కారణమవుతుంది. అందుకే గోరువెచ్చని లేదా చన్నీటితో తల స్నానం చేయడం ఉత్తమం.

సమతుల ఆహారం: చుండ్రు నివారణలో మనం తీసుకొనే ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సాధారణంగా శీతాకాలంలో వేడివేడిగా ఉండే నూనెలో వేయించిన ఆహార పదార్థాలు తీసుకొంటాం. నీళ్లు తక్కువగా తాగుతాం. వీటివల్ల తల చర్మం పొడిబారి, పొట్టు వస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, జింక్‌, విటమిన్‌ బి, ఇ అధికంగా ఉండే నట్స్‌, ఆకుకూరలను మీ మెనూలో చేరిస్తే... అవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహకరిస్తాయి. అలాగే నీళ్లు పుష్కలంగా తీసుకోవాలి. హెర్బల్‌ టీలు కూడా మంచి ఫలితాలనిస్తాయి.

ఇవి కూడా చదవండి...

వ్యవసాయ రంగం అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి మూలం: కిషన్‌రెడ్డి

ఒక్క ఛాన్స్ అని.. తెలంగాణని దివాళా తీయించారు.. సీఎం రేవంత్‌‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 01:05 AM