Share News

KTR Fires CM Revanth Reddy: ఒక్క ఛాన్స్ అని.. తెలంగాణని దివాళా తీయించారు.. సీఎం రేవంత్‌‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Nov 04 , 2025 | 09:01 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి బతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.

 KTR Fires CM Revanth Reddy: ఒక్క ఛాన్స్ అని.. తెలంగాణని దివాళా తీయించారు.. సీఎం రేవంత్‌‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
KTR Fires On CM Revanth Reddy

హైదరాబాద్, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(మంగళవారం) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో(Jubilee Hills By Poll) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి బతిమిలాడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.


దివాళా తీయించారు..

రేవంత్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకునే లాగా చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కి ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. 165 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారని ఫైర్ అయ్యారు. ఆయనకు ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. కేసీఆర్ హయాంలో అద్భుతంగా నడిచిన పాఠశాలలు మూతపడేలాగా చేశారని ఆక్షేపించారు మాజీ మంత్రి కేటీఆర్.


విద్యార్థుల ఆత్మహత్య..

హస్తం పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కి ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. ఇవాళ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ను ఆగం చేశారని విమర్శించారు. ఆయనకి ఒక్క అవకాశం ఇచ్చినందుకే.. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చినందుకే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆఖరి స్థానంలో నిలబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

వ్యవసాయ రంగం అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి మూలం: కిషన్‌రెడ్డి

ఏం చేస్తారో చేసుకోండి.. సీఐతో వైసీపీ నేత దురుసు ప్రవర్తన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 04 , 2025 | 09:41 PM