ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Professor Madhavilatha on Success: జీవితం గురించి ఇక్కడే నేర్చుకున్నా

ABN, Publish Date - Oct 26 , 2025 | 02:39 AM

‘‘విజయం ఒక్క రోజులో రాదు... నిరంతరం కష్టపడితేనే అది మనల్ని వరిస్తుంది’’ అంటున్నారు బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎసీ) ప్రొఫెసర్‌ మాధవీలత. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే...

‘‘విజయం ఒక్క రోజులో రాదు... నిరంతరం కష్టపడితేనే అది మనల్ని వరిస్తుంది’’ అంటున్నారు బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎసీ) ప్రొఫెసర్‌ మాధవీలత. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెన నిర్మాణంలో ఆమె కీలకపాత్ర పోషించారు. తాను చదువుకున్న ‘వరంగల్‌-నిట్‌’లో ‘టెక్నోజియాన్‌-2025’ ప్రారంభోత్సవానికి హాజరైన మాధవీలత ‘నవ్య’తో పలు విషయాలు పంచుకున్నారు.

‘‘నేను ‘ఆర్‌ఈసీ’ (ప్రస్తుతం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)- వరంగల్‌) పూర్వ విద్యార్థిని. సివిల్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ ఇక్కడే చేశాను. ఈ రెండేళ్లు నేను ఇక్కడ గడిపిన కాలాన్ని, అధ్యాపకుల సహకారాన్ని మరిచిపోలేను. జీవితం అంటే ఇక్కడే నేర్చుకున్నాను. ఈనాటి నా విజయానికి పునాది ‘నిట్‌’లో పొందిన జ్ఞానమే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నేను చదువుకున్న ఈ కాలేజీకి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. నాటి జ్ఞాపకాలన్నీ మరోసారి మనసులో మెదులుతున్నాయి. నా భర్త కూడా ఈ క ాలేజీ పూర్వ విద్యార్థే.

సక్సెస్‌ అంటే..

సక్సెస్‌ అంటే నా దృష్టిలో రెండు రకాలు. ఒకటి సమాజానికి ఉపయోగపడే రీతిలో నిర్మాణాత్మకమైన ఒక పనిని విజయవంతంగా, అత్యంత ప్రతిభావంతంగా చేయగలిగే ‘బాహ్య విజయం’ ఒకటి. దీనివల్ల పొందే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఇక మనకు ఆత్మసంతృప్తిని పరిపూర్ణంగా కలిగించేది ‘అంతర్‌ విజయం’. మనిషి ఈ రెండిటినీ ఎప్పుడూ అనుభూతి చెందుతూ ఉండాలి. కష్టపడకుండా ఏదీ రాదు. అలాగని 24 గంటలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నా విషయానికి వస్తే... నేను కష్టపడ్డాను అలాగే కుటుంబాన్ని కూడా పట్టించుకున్నాను. జమ్ము-కశ్మీర్‌లోని చీనాబ్‌ బ్రిడ్జి నిర్మాణంలో పాలుపంచుకున్నప్పుడు... అంత పని ఒత్తిడిలోనూ కుటుంబంతో గడిపాను. బాధ్యతలతోపాటు కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్‌ చేయగలగాలి. కుటుంబం చాలా ముఖ్యం. అయితే కుటుంబం కోసం మన అలవాట్లను మానుకోవాల్సిన అవసరం కూడా లేదు. కష్టపడుతూనే మన హాబీలను కొనసాగించుకోవచ్చు. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సమయం చిక్కినప్పుడల్లా పొలం పనులు చేస్తాను.

లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

యువత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటి సాధనకు నిరంతరం శ్రమించాలి. ఏది ముఖ్యమో అదే చేయాలి. సెల్‌ఫోన్‌కు అతుక్కుపోయి గంటల తరబడి సమయాన్ని వృధా చేయకూడదు. మన ముందున్న లక్ష్యాలు ఏమిటి? ఉన్నతస్థాయికి ఎదగడానికి ఏం చేయాలి? అనేది యువత గుర్తెరగాలి. అలాగే సామాజిక సంబంధాలు ఎంతో ముఖ్యం. ఈనాటి యువకులు, ముఖ్యంగా విద్యార్థులు తమ చుట్టు గిరిగీసుకుంటున్నారు. వారికి సన్నిహితులైన స్నేహితులు తక్కువ మంది ఉంటున్నారు. ఎక్కువ మంది స్నేహితులు ఉండాలి. ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి సన్నిహితులు ఉండాలి. పదిమంది మనుషులు మనకు దగ్గరగా ఉన్నప్పుడు సమస్యలు చెప్పుకుంటే తేలికవుతుంది. అది లేకపోవడం వల్లే యువత నైరాశ్యానికి గురవుతున్నారు. ఏ రంగంలోనూ నేను విజయం సాఽధించలేకపోతున్నానే బాధ వారిని కుంగదీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కుటుంబం అండగా ఉండాలి. వారిలో ఆత్మస్తైర్యం పెంపొందించాలి. విజయం అనేది ఒక్క రోజులో రాదు. నిరంతరం నిజాయితీగా కష్టపడితేనే దాన్ని పొందగలం.’’

చీనాబ్‌ వంతెన గుర్తింపు తెచ్చింది...

చీనాబ్‌ వంతెన నిర్మాణం నాకు అనుభవంతో పాటు గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది. ఈ వంతెన నిర్మాణంలో కన్సల్టెంట్‌గా 17 ఏళ్లుగా పనిచేసిన ఏకైక మి హళను నేనే. మధ్యలో ఎంతోమంది వెళ్లిపోయారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కొనసాగాను. ఆ వంతెన నిర్మాణంలో ఎంతో మంది కృషి ఉంది.


-రమేష్ బాబు, హన్మకొండ

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 26 , 2025 | 12:15 PM