Potato Beauty Tips: ఆలూతో అందంగా
ABN, Publish Date - Dec 10 , 2025 | 05:07 AM
ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసేందుకు రకరకాల క్రీమ్‌లు, లోషన్లు వాడుతూ ఉంటాం. ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాం. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. అలాకాకుండా...
ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసేందుకు రకరకాల క్రీమ్‌లు, లోషన్లు వాడుతూ ఉంటాం. ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాం. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. అలాకాకుండా ఆలుగడ్డను ఉపయోగించి ముఖాన్ని అందంగా మార్చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు
ఆలుగడ్డలో యాంటీ బ్యాక్టీరియల్, బ్లీచింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తురమాలి. ఈ తురుంను చేత్తో తీసుకుని గిన్నెలోకి గట్టిగా పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని చూపుడు వేలు సహాయంతో ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత మంచినీటితో కడిగేసుకుంటే చర్మ రంధ్రాల్లో పేరుకున్న మురికి తొలగిపోయి ముఖం సహజంగా ప్రకాశిస్తుంది.
చిన్న గిన్నెలో నాలుగు చెంచాల బంగాళదుంప రసం, ఒక చెంచా పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే ఎండలో తిరిగినప్పుడు వచ్చిన ట్యానింగ్, కళ్ల కింద ఏర్పడిన నలుపుదనం తగ్గిపోతాయి. చర్మం తేమతో నిండి ముఖం మృదువుగా మెరుస్తుంది.
బంగాళదుంపను.. తొక్క తీసి మెత్తటి గుజ్జులా బ్లెండ్ చేయాలి. అందులో ఒక చెంచా తేనె, ఒక చెంచా కీర రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటసేపు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేసుకోవాలి. మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తుంటే మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు తగ్గిపోతాయి.
ఒక గిన్నెలో రెండు చెంచాల ఆలుగడ్డ రసం, రెండు చెంచాల టమాటా గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేతి వేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తుంటే ముఖం మీద చర్మం బిగుతుగా మారుతుంది. అకాల వార్థక్య లక్షణాలు తగ్గుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 10 , 2025 | 05:07 AM