Share News

Gaurav Luthra: థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:47 PM

నైట్‌క్లబ్ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పారిపోయారు. గత ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు గౌరవ్ (44) అతని సోదరుడు సౌరభ్ (40) పుకెట్ వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించినట్టు పోలీసులు చెబుతున్నారు.

Gaurav Luthra: థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా
Goa nightclub owner Gaurav Luthra

పనజి: గోవాలోని 'బిర్క్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన వెంటనే దేశం విడిచి పరారైన క్లబ్ యజమానుల్లో ఒకరైన గౌరవ్ లూథ్రా ఆచూకీ తెలిసింది. థాయ్‌లాండ్‌ (Thailand)లోని పుకెట్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ చెక్ సమయంలో ఆయన కనిపించారు. ఆ తర్వాత సోదరులిద్దరూ పుకెట్ రిసార్ట్‌కు చేరుకున్నారని, అయితే అధికారులు అక్కడకు చేరుకునే లోపే ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టారని తెలుస్తోంది.


నైట్‌క్లబ్ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పారిపోయారు. గతఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు గౌరవ్ (44) అతని సోదరుడు సౌరభ్ (40) పుకెట్ వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఈ ఇద్దరూ ఢిల్లీలోనే ఉన్నారు.


బ్లూకార్నర్ నోటీసులు

మరోవైపు, గౌరవ్ లూథ్రా, సౌరబ్ లూథ్రాలపై ఇంటర్‌పోల్ తాజాగా బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసింది. పరారీలో ఉన్న సోదరుల జాడను తెలుసుకునేందుకు గోవా పోలీసులు ఇంటర్‌పోల్ సాయం కోరడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి.


నైట్‌క్లబ్ కూల్చివేతకు ఆదేశం

కాగా, గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టి 25 మంది ప్రాణాలను బలికొన్ని రోమియో లేన్ నైట్‌క్లబ్ కూల్చివేతకు ఆదేశాలిచ్చింది. అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి తక్షణం నైట్‌క్లబ్‌ను కూల్చేయాలని జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదేశాలిచ్చారు. కూల్చివేత ఆపరేషన్‌కు యంత్రాంగం, సిబ్బంది సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

లూథ్రా బ్రదర్స్‌ కోసం వేట.. ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసు

నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు.. సోనియా గాంధీకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 09 , 2025 | 04:49 PM