New Cancer Theory: క్యాన్సర్ కొత్త సిద్ధాంతం బ్రో హైపోథిసిస్
ABN, Publish Date - Oct 28 , 2025 | 01:41 AM
బిగుతైన బ్రాసరీలతో లింఫ్ స్రావాలకు అంతరాయం ఏర్పడి, రొమ్ములో సమస్యలు తలెత్తవచ్చనే ‘బ్రో హైపోథిసిస్’ అనే కొత్త సిద్ధాంతం ఇప్పుడు తెరపైకొచ్చింది. దీని గురించి తెలుసుకుందాం!...
సిద్ధాంతం
బిగుతైన బ్రాసరీలతో లింఫ్ స్రావాలకు అంతరాయం ఏర్పడి, రొమ్ములో సమస్యలు తలెత్తవచ్చనే ‘బ్రో హైపోథిసిస్’ అనే కొత్త సిద్ధాంతం ఇప్పుడు తెరపైకొచ్చింది. దీని గురించి తెలుసుకుందాం!
బిగుతైన లోదుస్తులకూ లింఫ్ స్రావాల అవరోధాలకూ మధ్య సంబంధం ఉందనే ‘బ్రో హైపోథిసిస్’ అనే ఒక సిద్ధాంతం, క్యాన్సర్ ప్రివెన్షన్ స్టడీ జర్నల్‌లో ప్రచురితమైంది. దీనికి రుజువులు పరిమితంగానే ఉన్నప్పటికీ, ఆకర్షణీయంగా కనిపించే క్రమంలో మహిళలు బిగుతైన, సింథటిక్ డిజైన్లను కలిగిన బ్రాసరీలను ఎంచుకోవడంలో దాగి ఉన్న ఆరోగ్య సమస్యలకు సంబంధించి పలు చర్చలు జరిగాయి. లోదుస్తుల వస్త్రాల్లో హార్మోన్లను అస్తవ్యస్థపరిచే థాలేట్స్, ఫార్మాల్డిహైడ్, సింథటిక్ రంగులు, బిస్ఫినాల్స్ మొదలైన రసాయనాలు దాగి ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో క్యాన్సర్ ముప్పుకు దారి తీస్తాయి. సాధారణంగా బ్రాసరీల తయారీ కోసం పాలియస్టర్, నైలాన్, స్పాండెక్స్ వస్త్రాలనే ఉపయోగిస్తూ ఉంటారు. వీటన్నింట్లో ఈ విషపూరిత రసాయనాలు దాగి ఉంటాయి. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడం కోసం, కాటన్, వెదురు, సేంద్రీయ పదార్థాలతో తయారైన బ్రాసరీలనే ఉపయోగించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More AP News And Telugu News
Updated Date - Oct 28 , 2025 | 01:41 AM