Indian Railway: రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:54 PM
మొంథా తుపాన్ నేపథ్యంలో 43 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. అయితే పలు రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులకు సూచించింది.
విశాఖపట్నం, అక్టోబర్ 27: మొంథా తుపాన్ ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకొస్తోంది. దీంతో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి బయలుదేరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. అలాగే విశాఖపట్నం మీదుగా నడిచే పలు రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
మొత్తంగా 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించింది. అయితే అక్టోబర్ 27వ తేదీన ముందుగా రద్దు అని ప్రకటించిన రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ సోమవారం ప్రకటించింది. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులకు సూచించింది. అందుకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది.
ఈ రైళ్లు..
12727 విశాఖపట్నం - సికింద్రాబాద్ ( గోదావరి ఎక్స్‌ప్రెస్)
12739 విశాఖపట్నం - సికింద్రాబాద్ (గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్)
27,29 తేదీల్లో 20805/06 విశాఖపట్నం - న్యూఢిల్లీ (ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్)
08583 విశాఖపట్నం - తిరుపతి (స్పెషల్ ఎక్స్‌ప్రెస్)
22707 విశాఖపట్నం - తిరుపతి (డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్)
17243/ 44 గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్
17220 విశాఖపట్నం - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
17243 గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్
12861 విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్‌ప్రెస్
22869 విశాఖపట్నం - MGR చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
27, 29 తేదీల్లో 18519/20 విశాఖపట్నం - ఎల్ టీటీ ఎక్స్‌ప్రెస్
ఇక 28వ తేదీన భువనేశ్వర్ - కేఎస్ఆర్ బెంగళూరు (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్) రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే 28వ తేదీన 17015 భువనేశ్వర్ - సికింద్రాబాద్ ( విశాఖ ఎక్స్‌ప్రెస్) రద్దు చేసినట్లు తెలిపింది.
అలాగే 28వ తేదీ టాటా నగర్ నుంచి బయలుదేరాల్సిన 18189 టాటా నగర్ - ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ తిట్లాగర్, రాయపూర్, నాగపూర్, బల్లర్ష మీదుగా దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది.
రైల్ మార్గం కుదింపు..
27వ తేదీ భువనేశ్వర్ నుంచి జగదల్పూర్ వెళ్లాల్సిన 18447 హిరాకండ్ ఎక్స్‌ప్రెస్ రైలు రాయగడ వరకు కుదింపు.
27వ తేదీ రూర్కెలా - జగదల్పూర్ వెళ్లాల్సిన 18107 ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు రాయగడ వరకు కుదింపు
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News And Telugu News