Makeup Tips: వస్త్రధారణకు నప్పేలా
ABN, Publish Date - Dec 20 , 2025 | 06:37 AM
ఏ వస్త్రధారణకైనా ఒకే రకమైన మేకప్ నప్పుతుందనుకుంటే పొరపాటు. ఎంచుకునే దుస్తులను బట్టి మేకప్‌ను కూడా ఆచితూచి ఎంచుకోవాలి. అందుకోసం ఇవిగో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి...
మేకప్
ఏ వస్త్రధారణకైనా ఒకే రకమైన మేకప్ నప్పుతుందనుకుంటే పొరపాటు. ఎంచుకునే దుస్తులను బట్టి మేకప్‌ను కూడా ఆచితూచి ఎంచుకోవాలి. అందుకోసం ఇవిగో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి
ఆధునికంగా...
జీన్స్, స్కర్ట్స్ లాంటి ఆధునిక వస్త్రధారణకు భిన్నమైన మేకప్ ఎంచుకోవాలి. లిప్‌స్టిక్, ఐషాడోలతో పాటు, బ్లష్ కూడా ముదురు రంగులో ఉండాలి. కాటుక దిద్దిన కళ్లు, నలుపు, బూడిద రంగు ఐషాడోలు నలుపు రంగు దుస్తులకు చక్కగా సూటవుతాయి. కృత్రిమ కనురెప్పులను వాడుకునేవాళ్లు, రెండంచెల మస్కారా అప్లై చేయాలి
డిజైనర్ చీర కడితే...
డిజైనర్ చీరల కోసం మెరుపులీనే మేకప్ టిప్స్ అనుసరించాలి. గ్లిట్టర్ లిప్‌స్టిక్, మస్కారాలు ఎంచుకోవచ్చు. నుదురు, ముక్కు, గొంతు దగ్గర హైలైటర్ తప్పనిసరిగా అప్లై చేయాలి. లిప్‌గ్లాస్ కూడా వాడుకోవచ్చు. సిల్వర్ లేదా గోల్డ్ హ్యూ ఉన్న బ్లష్, లిప్‌స్టిక్‌లు కూడా ఈ వస్త్రధారణకు చక్కగా సూటవుతాయి
సంప్రదాయంగా...
పట్టు చీరల్లో మెరిసిపోవాలనుకుంటే, మ్యాట్ లిప్‌స్టిక్ ఎంచుకోవాలి. చీర పవిట ఏ రంగులో ఉంటే, ఆ రంగు లిప్‌స్టిక్, ఐషాడోలను ఎంచుకోవాలి. అయితే కొట్టొచ్చేలా అవసరానికి మించి మేకప్ వేసుకోకుండా, వీలైనంత తక్కువ మేకప్ వాడుకోవాలి. బ్లష్, ఐషాడోల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
For More AP News And Telugu News
Updated Date - Dec 20 , 2025 | 06:37 AM