ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

How to Keep Your Jeans Looking New: జీన్స్‌ కొత్తగా

ABN, Publish Date - Oct 29 , 2025 | 05:22 AM

మనం సాధారణంగా నీలం, నలుపు లాంటి ముదురు రంగుల జీన్స్‌ను ఎక్కువగా ధరిస్తూ ఉంటాం. వీటిని ఉతికేటప్పుడు చేసే కొన్ని పొరబాట్ల వల్ల అవి త్వరగా రంగులు వెలిసిపోతుంటాయి. అలాకాకుండా...

మనం సాధారణంగా నీలం, నలుపు లాంటి ముదురు రంగుల జీన్స్‌ను ఎక్కువగా ధరిస్తూ ఉంటాం. వీటిని ఉతికేటప్పుడు చేసే కొన్ని పొరబాట్ల వల్ల అవి త్వరగా రంగులు వెలిసిపోతుంటాయి. అలాకాకుండా జీన్స్‌ చాలాకాలంపాటు కొత్తగా కనిపించాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...

  • జీన్స్‌ను మొదటిసారి ఉతికేటప్పుడు సబ్బు, ఇతర డిటర్జెంట్లు ఉపయోగించకూడదు. మామూలు నీళ్లలో ముంచి ఆరేయడం మంచిది. మరీ మురికిగా అనిపిస్తే ఉప్పు, వెనిగర్‌ కలిపిన నీళ్లలో కొద్దిసేపు ఉంచి తీస్తే సరిపోతుంది.

  • జీన్స్‌ను లోపలికి తిప్పి ఉతకడం వల్ల వాటి రంగు ఎక్కువకాలం నిలిచి ఉంటుంది. అరగంటకు మించి నీళ్లలో నానబెట్టకూడదు. వాషింగ్‌ మెషిన్‌లో వేయకూడదు. జీన్స్‌ను వేడినీళ్లతో ఉతకకూడదు.

  • త్వరగా ఆరాలంటూ జీన్స్‌ను ఎండలో ఆరేయకూడదు. నీడలో గాలి తగిలేలా మాత్రమే ఆరేయాలి.

  • వర్షాకాలంలో తరచూ జీన్స్‌ మీద బురద మరకలు పడుతుంటాయి. అలాంటప్పుడు జీన్స్‌ను వెంటనే ఉతకడానికి వేయకుండా గాలి తగిలేలా ఆరేయాలి. బురద మరకలు బాగా ఎండిన తరువాత వాటి మీద కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లి పాత టూత్‌బ్ర్‌షతో గట్టిగా రుద్దితే బురద పూర్తిగా రాలిపోతుంది. తరువాత జీన్స్‌ను లిక్విడ్‌ డిటర్జెంట్‌ కలిపిన నీళ్లలో అయిదు నిమిషాలు నానబెట్టి చేత్తో ఉతికితే సరిపోతుంది.

  • జీన్స్‌ మీద నూనె లేదా గ్రీజ్‌ మరకలు పడితే వాటి మీద కొద్దిగా ఉప్పు చల్లి పది నిమిషాల తరువాత దూదితో రుద్దాలి. ఆపైన తేలికపాటి షాంపూ కలిపిన నీళ్లతో ఉతికితే మరకలు పూర్తిగా పోతాయి.

ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 05:23 AM