Overcome Porn Addiction: ఆ అడిక్షన్‌ను వదిలించేదెలా
ABN, Publish Date - Dec 04 , 2025 | 02:15 AM
డాక్టర్ మా వారికి పోర్న్ చూసే అలవాటుంది. క్రమేపీ ఈ అలవాటు పెరుగుతూ పోతోంది. ఖాళీ సమయాల్లో గంటల తరబడి పోర్న్ చూస్తూ, నాతో సమయం గడపడం తగ్గించేస్తున్నారు...
కౌన్సెలింగ్
డాక్టర్! మా వారికి పోర్న్ చూసే అలవాటుంది. క్రమేపీ ఈ అలవాటు పెరుగుతూ పోతోంది. ఖాళీ సమయాల్లో గంటల తరబడి పోర్న్ చూస్తూ, నాతో సమయం గడపడం తగ్గించేస్తున్నారు. ఆయనను మార్చుకునేదెలా?
- ఓ సోదరి, హైదరాబాద్.
మీ వారికి ఈ అలవాటు టీనేజీలో మొదలై ఉంటుంది. అప్పుడప్పుడూ పోర్న్ చూడడం వల్ల పెద్దగా ఇబ్బందేమీ లేదు. కానీ అదే పనిగా పెట్టుకుని భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తే భార్యాభర్తల అనుబంధం బీటలుబారుతుంది. మీ వారు పోర్న్‌కు నిజంగానే బానిస అయ్యారో లేదో తెలుసుకోవడం కోసం ఈ కింది లక్షణాలను గమనించండి
లైంగికంగా కలవడానికి మించి పోర్న్ మీద ఆసక్తి కనబరచడం
పోర్న్ వల్ల రోజువారీ పనులను వాయిదా వేస్తూ ఉండడం, బాఽధ్యతలను అశ్రద్ధ చేయడం
పోర్న్ చూడనిదే లైంగికోద్రేకం పొందలేకపోవడం
చాటుమాటుగా పోర్న్ చూడడం
ఆ అలవాటు గురించి చర్చించడానికి ఇష్టపడకపోవడం
పై లక్షణాల ఆధారంగా మీవారు పోర్న్‌కు బానిస అయ్యారో లేదో కనిపెట్టవచ్చు. ఒకవేళ మీ అనుమానమే నిజమని తేలితే ఆ అలవాటు వల్ల మీరెంత బాఽధపడుతున్నదీ స్పష్టంగా చెప్పండి. అది వ్యసనంగా మారిందేమో ఆయన్నే అడగండి. అవసరమైతే సెక్సాలజిస్ట్ సహాయం తీసుకోండి. చాలా సందర్భాల్లో భార్యలు భర్తల్ని ‘నేను కావాలో, పోర్న్ కావాలో తేల్చుకో!’ అని కండిషన్ పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొందరు భర్తలు నిజాయితీగా పోర్న్ మానేస్తారు. మరికొందరు చాటుమాటుగా అదే అలవాటును కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి నేర్పుతో మసలుకోవాలి.
డాక్టర్ షర్మిలా మజుందార్
సెక్సాలజిస్ట్ అండ్ సైకో అనలిస్ట్,
email: mili77@gmail.com
ఇవి కూడా చదవండి
హక్కుల తీర్మానం గురించి అడిగితే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇదే
ఐదెన్ మార్‌క్రమ్ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో సఫారీల అద్భుత పోరాటం..
Updated Date - Dec 04 , 2025 | 02:15 AM