Home Remedies: మోకాళ్ల నలుపును వదిలించండిలా...
ABN, Publish Date - Dec 25 , 2025 | 02:10 AM
బడికి వెళ్లే పిల్లలకు మోకాళ్లు నల్లగా మారడం చూస్తూ ఉంటాం. ఈ సమస్యను తీర్చే ఇంటి చిట్కాలివే...
బడికి వెళ్లే పిల్లలకు మోకాళ్లు నల్లగా మారడం చూస్తూ ఉంటాం. ఈ సమస్యను తీర్చే ఇంటి చిట్కాలివే...
రోజూ మోకాళ్ల మీద కొద్దిగా షియా బటర్ లేదంటే మామూలు వెన్న రాసి సున్నితంగా మర్దన చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై మోకాళ్లు రంగు తిరుగుతాయి.
కలబంద జెల్‌తో మోకాళ్ల మీద మర్దన చేస్తే అక్కడ పేరుకున్న మృతకణాలు తొలగి మంచి ఫలితం కనిపిస్తుంది.
పిల్లలకు బిగుతుగా ఉండే ప్యాంట్లు, లెగ్గింగ్స్ వేయకూడదు. వీటివల్ల మోకాళ్లమీద చర్మం రాపిడీకి గురై నల్లబడే అవకాశం ఉంటుంది.
చిన్న గిన్నెలో నాలుగు చెంచాల కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె తీసుకుని గోరువెచ్చగా వేడిచేయాలి. పిల్లలు రాత్రి పడుకునేముందు మోకాళ్లమీద ఈ నూనెను రాసి సున్నింతంగా రుద్దాలి. రెండు రోజుల్లో మోకాళ్లు ఛాయగా మారతాయి. ఇలా ఆలివ్ ఆయిల్‌ను కూడా రాయవచ్చు.
ఒక కప్పు పుల్లటి పెరుగులో ఒక చెంచా శనగపిండిని కలిపి మోకాళ్లకు పట్టించాలి. పావుగంటసేపు ఆరనిచ్చి తరువాత మెల్లగా మర్దన చేస్తూ పిండిని తొలగించాలి. ఆపైన గోరువెచ్చని నీటితో కడిగేస్తే మోకాళ్ల నలుపుదనం తగ్గుతుంది.
మోకాళ్ల మీద తరచూ గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ నీళ్లు చిలకరించి మర్దన చేసినా ప్రయోజనం కనిపిస్తుంది.
చిన్న గిన్నెలో రెండు చెంచాల ఓట్‌మీల్ పొడి, రెండు చెంచాల ఫ్రెష్ క్రీమ్, ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల మీద రాసి సున్నితంగా మర్దన చేయాలి. ఆపైన గోరువెచ్చని నీటితో కడిగేస్తే సమస్య తీరుతుంది.
పిల్లలు బడికి లేదా ఆడుకోడానికి బయటికి వెళ్లేటప్పుడు మోకాళ్ల మీద కొద్దిగా మాయిశ్చరైజర్ రాసినా ఫలితం ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
వీరన్న హత్య కేసులో వీడిన మిస్టరీ... అసలు నిజం ఇదే
తిప్పలు పెడితే రాసుకోండి.. మిత్తీతో సహా తీర్చేద్దాం: హరీష్ రావు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 25 , 2025 | 02:10 AM