Mahabubabad: వీరన్న హత్య కేసులో వీడిన మిస్టరీ... అసలు నిజం ఇదే
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:52 PM
మహబూబాద్ జిల్లాలో హత్యకు గురైన వీరన్న కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరన్నను కట్టుకున్న భార్యే హత్య చేయించినట్లు నిర్ధారణ అయ్యింది.
మహబూబాబాద్, డిసెంబర్ 24: జిల్లాలో కేసముద్రం మండలం బోడమంచ్యా తండాలో వీరన్న అనే వ్యక్తి దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ హత్యలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో కలిసి భార్య విజయే భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భర్తను హత్య చేసి ఆపై ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే మృతుడి పేరుపై ముందే రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ చేయించారు భార్య విజయ, ఆమె ప్రియుడు ఆర్ఎం డాక్టర్ భరత్. ఈ కారణంగానే భర్తను దారుణంగా హత్య చేసినట్లు విచారణలో పోలీసులు తేల్చారు.
మరోవైపు వీరన్న హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడి బంధువులు గ్రామంలో ఆందోళనకు దిగారు. వీరన్న హత్యకు కారకుడైన ఆర్ఎంపీ వైద్యుడు భరత్‌కు చెందిన రేకుల షెడ్డును ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఓ బైక్‌ను కూడా మృతుడి బంధువులు దహనం చేశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామంలోకి చేరుకుని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. తమకు న్యాయం కావాలంటూ వీరన్న బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ ఆధారాలు...
లక్షల్లో శిశువుల విక్రయం.. 12 మంది అరెస్ట్
Read Latest Telangana News And Telugu News