Child Trafficking: లక్షల్లో శిశువుల విక్రయం.. 12 మంది అరెస్ట్
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:28 PM
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 15 మంది పిల్లలను అమ్మిన ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 24: సరోగసి పేరుతో దంపతుల నుంచి లక్షల్లో వసూలు చేసి, పిల్లలను అక్రమంగా విక్రయించిన సృష్టి కేసు రాష్ట్రంలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా భాగ్యనగరంలో మరో సృష్టి కేసు వెలుగులోకి వచ్చింది. పసి పిల్లలను అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పిల్లల విక్రయానికి లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 12 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి బారి నుంచి పిల్లలను రక్షించారు. వివరాళ్లోకి వెళితే..
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 15 మంది పిల్లలను అమ్మిన ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో శిశువులను విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నగరంలోని ఎనిమిది ఆస్పత్రులకు ఏజెంట్లగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నుంచి ఇద్దరు బాలలను ఎస్వోటీ పోలీసులు కాపాడారు. అంతే కాకుండా ఒక్కొక్క శిశువు అమ్మకం వెనకాల 15 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
ఇవి కూడా చదవండి...
చిరుత సంచారం.. తస్మాత్ జాగ్రత్త
ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ ఆధారాలు...
Read Latest Telangana News And Telugu News