Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ ఆధారాలు...
ABN , Publish Date - Dec 24 , 2025 | 10:43 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పెన్ డ్రైవర్ కీలక ఆధారంగా మారింది. పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్, డిసెంబర్ 24: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. ఇక ట్యాపింగ్ కేస్‌లో ఓ పెన్ డ్రైవర్ కీలక ఆధారంగా మారింది. పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా పని చేసిన టైంలో పెన్ డ్రైవ్‌లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లు సిట్ గుర్తించింది.
పెన్‌డ్రైవ్‌లో వందల కొద్దీ ఫోన్ నెంబర్లు గుర్తించారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీల ప్రొఫైల్స్‌ను పెన్ డ్రైవ్‌లో స్టోర్ చేసినట్టు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ సిట్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావ్ టీమ్ అన్ని ఆధారాలు ధ్వంసం చేసినా ఈ పెన్ డ్రైవ్‌ను సిట్ స్వాధీనం చేసుకుంది.
కేస్ ప్రూవ్ చేయటానికి ఈ పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ అధికారులు అంటున్న పరిస్థితి. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావ్ నుంచి పూర్తి వివరాలను సిట్ అధికారులు సేకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
ఎల్‌వీఎం -3 ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతం
చిరుత సంచారం.. తస్మాత్ జాగ్రత్త
Read Latest Telangana News And Telugu News