Leopard Movement: చిరుత సంచారం.. తస్మాత్ జాగ్రత్త
ABN , Publish Date - Dec 24 , 2025 | 09:59 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో చిరుత కనిపించిందని ప్రజలు చెబుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, డిసెంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చిరుతల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తరచుగా చిరుత సంచరిస్తుండంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచిరిస్తున్న గ్రామాల్లో వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లాలన్నా, రాత్రుళ్లు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లాలంటేనే స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. చిరుత ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్న బిక్కుబిక్కుమంటూ ప్రజలు గడుపుతున్నారు. ఇప్పుడు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. రాత్రి ఓ బండపై ఉన్న చిరుతను అటువైపు వెళ్తున్న కొందరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. గ్రామంలో చిరుత కనబడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రుద్రంగి, మర్రిమడ్ల, మనాల ప్రాంతంలో చిరుతలు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వీలైనంత తొందరగా చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎల్‌వీఎం -3 ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతం
Read Latest Telangana News And Telugu News