New Year: సీపీ సజ్జనార్ వార్నింగ్.. హద్దుమీరితే సంతోషం చెడుద్ది మరి!
ABN , Publish Date - Dec 24 , 2025 | 08:15 AM
డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే సంతోషం చెడుద్ది మరి.. అని అంటున్నారు నగర పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్. బుధవారం నుంచి డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, డిసెంబర్-31న 100 ప్రాంతాల్లో తనిఖీలు చేపడతామని ఆయన అన్నారు.
- నేటి నుంచే డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్
- డిసెంబర్-31న 100 ప్రాంతాల్లో తనిఖీలు
- నగర సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ: న్యూ ఇయర్ వేడుకల్లో నిర్వాహకులు, వినియోగదారులు హద్దుమీరినా, రూల్స్ అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్(Hyderabad CP Sajjanar) హెచ్చరించారు. కొత్త సంవత్సరంలో సంతోషం లేకుండా పోతుందని అన్నారు. ఈవెంట్ నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి, విధానాలపై క్షేత్రస్థాయి సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. పార్టీల నిర్వహణకు పోలీస్ అనుమతికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో సౌండ్స్ సిస్టం, లౌడ్ స్పీకర్ రాత్రి 10:00కి క్లోజ్ చేయాలన్నారు. 15 షీటీమ్స్ బృందాలను మఫ్టీలో రంగంలోకి దింపుతామన్నారు.

రాత్రి 9 గంటల నుంచే..
డిసెంబరు-31 అర్థరాత్రి ఎక్కడిక్కడ డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. అన్ని ప్రాంతాల్లోనూ చెక్‌పోస్టులు పెడుతున్నామన్నారు. రాత్రి 9 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ ఉంటుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
Read Latest Telangana News and National News