Share News

RV Karnan: మార్చి 31 వరకు ఓటీఎస్‌.. సద్వినియోగం చేసుకోండి..

ABN , Publish Date - Dec 24 , 2025 | 08:38 AM

మార్చి 31 వరకు వన్‌ టైం స్కీ గడువు ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌ నగర ప్రజలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. విలీన మునిసిపాల్టీల పరిధిలోనూ మాఫీ వర్తిస్తుందని ఆయన అన్నారు.

RV Karnan: మార్చి 31 వరకు ఓటీఎస్‌.. సద్వినియోగం చేసుకోండి..

- అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్న కర్ణన్‌

- ఈ నెల 4న జీఓ.. బహిర్గతం చేయని వైనం

హైదరాబాద్‌ సిటీ: ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌(Commissioner RV Karnan) సూచించారు. పన్ను బకాయిలపై వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్‌ టైం స్కీమ్‌ (ఓటీఎస్‌) ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల యజమానులు ఓటీఎస్‌కు అర్హులని, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31వ తేదీ వరకు ఓటీఎస్‌ గడువు ఉందని పేర్కొన్నారు.


విలీన మునిసిపాల్టీల పరిధిలోనూ మాఫీ వర్తిస్తుందని, పన్ను చెల్లింపుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బల్దియా పౌర సేవ కేంద్రాలు, బిల్‌ కలెక్టర్లు, మీ సేవా, ఆన్‌లైన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పన్ను చెల్లించవచ్చన్నారు. కాగా, ఈ నెల 4వ తేదీన పురపాలక శాఖ ఓటీఎస్‌ ఉత్తర్వులు జారీ చేయగా, జీహెచ్‌ఎంసీ(GHMC) బయటక చెప్పకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


city5.2.jpg

పౌరుల నుంచి పూర్తి పన్ను వసూలు చేసే క్రమంలోనే జీఓ విడుదలను రహస్యంగా ఉంచారా? మరేదైనా కారణం ఉందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఓటీఎస్‌ జీఓ బహిర్గతం కావడంతో 90 శాతం వడ్డీ మాఫీ పోను మిగిలిన పన్ను బకాయి ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

నిరాశ వదిలించి...నవజీవనం వైపు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2025 | 08:38 AM