Clean and Shine Copper Bottles: కాపర్ బాటిల్స్‌ని ఇలా
ABN, Publish Date - Dec 21 , 2025 | 07:04 AM
మంచినీళ్లు తాగడానికి ఉపయోగించే కాపర్ బాటిల్స్ క్రమంగా రంగు మారుతూ ఉంటాయి. వీటిని కొత్తవాటిలా మెరిపించే చిట్కాలు...
మంచినీళ్లు తాగడానికి ఉపయోగించే కాపర్ బాటిల్స్ క్రమంగా రంగు మారుతూ ఉంటాయి. వీటిని కొత్తవాటిలా మెరిపించే చిట్కాలు...
చిన్న గిన్నెలో రెండు చెంచాల ఉప్పు, ఒక చెంచా నిమ్మరసం లేదా వెనిగర్ వేసి పేస్టులా చేయాలి. దీన్ని కాపర్ బాటిల్ మీద పూతలా రాయాలి. ఈ పేస్టులో కొన్ని నీళ్లు కలిపి బాటిల్‌లో పోయాలి. పాత టూత్‌బ్రష్‌తో బాటిల్ పైన, లోపల రుద్ది కడిగితే సరిపోతుంది.
వెడల్పాటి గిన్నెలో సగానికి పైగా వేడినీళ్లు తీసుకోవాలి. అందులో రెండు నిమ్మ తొక్కలు, కొద్దిగా వెనిగర్ వేసి కలపాలి. పావుగంట తరువాత ఈ నీళ్లలో కాపర్ బాటిల్‌ని ముంచి అరగంటసేపు ఉంచాలి. తరువాత మంచినీళ్లతో కడిగేస్తే బాటిల్ కొత్తగా మెరుస్తుంది
చిన్న గిన్నెలో కొద్దిగా చింతపండు వేసి నీళ్లు చిలకరించి మెత్తగా నాననివ్వాలి. తరువాత గుజ్టు తీసి కాపర్ బాటిల్‌కి పట్టించాలి. పావుగంట సేపు నాననిచ్చి మెత్తటి స్క్రబ్బర్‌తో తోమి కడగాలి. ఈ గుజ్జులో కొన్ని నీళ్లు కలిపి బాటిల్‌లో పోసి కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి వేగంగా ఊపితే లోపల చేరిన మురికి కూడా వదిలిపోతుంది. గోరువెచ్చటి నీటితో కాపర్ బాటిల్‌ని కడిగితే లోపల నుంచి ఎటువంటి వాసనలు రావు.
ఇవీ చదవండి:
T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..
నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్
Updated Date - Dec 21 , 2025 | 07:04 AM