Reducing Coughs Naturally: తుమ్ములు తగ్గేదెలా
ABN, Publish Date - Dec 20 , 2025 | 06:35 AM
శీతాకాలంలో చల్లటి గాలులు, వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళివల్ల తరచూ తుమ్ములు వస్తుంటాయి. చిన్న చిట్కాలతో వాటిని నివారించుకోవచ్చు...
శీతాకాలంలో చల్లటి గాలులు, వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళివల్ల తరచూ తుమ్ములు వస్తుంటాయి. చిన్న చిట్కాలతో వాటిని నివారించుకోవచ్చు.
చిన్న గిన్నెలో ఒక చెంచా అల్లం రసం, అర చెంచా బెల్లం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకుంటుంటే తుమ్ములు తగ్గుతాయి.
గ్లాసు వేడి నీటిలో ఒక చెంచా తేనె, అర చెంచా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది
స్టవ్ మీద గిన్నె పెట్టి గ్లాసు నీళ్లు పోసి అందులో చెంచా వాము వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఆ నీటిని మరోగ్లాసులోకి వడబోసి అందులో ఒక చెంచా తేనె కలుపుకుని తాగితే తుమ్ముల సమస్య తీరుతుంది.
వెడల్పాటి గిన్నెలో సగానికిపైగా వేడినీళ్లు పోసి అందులో ఒక చెంచా యూకలిప్టస్ ఆయిల్ లేదా పిప్పరమెంట్ ఆయిల్ వేసి కలిపి ఆవిరి పడితే వెంటనే తుమ్ములు మాయమవుతాయి
జలుబు చేసినప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం కలుపుకుని తాగితే తుమ్ములు రావు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగినా ఫలితం కనిపిస్తుంది.
తరచూ తుమ్ములతో బాధపడేవారు ద్రాక్ష, కివీ, నారింజ, అరటి, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, జామ పండ్లను తినడంతోపాటు టమాటా, బ్రోకలీ, ఉసిరి, ముల్లంగి, బీట్‌రూట్, క్యాబేజీ, క్యాప్సికమ్ లాంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే సమస్య తీరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
For More AP News And Telugu News
Updated Date - Dec 20 , 2025 | 06:35 AM