Sweater Cleaning Tips: స్వెట్టర్ శుభ్రం ఇలా
ABN, Publish Date - Dec 04 , 2025 | 01:41 AM
చలికాలంలో పెద్దలు, పిల్లలు ఎక్కువగా ఉన్నితో తయారుచేసిన స్వెట్టర్లు ధరిస్తూ ఉంటారు. వీటి మీద మురికి చేరినప్పుడు వాటిని జాగ్రత్తగా శుభ్రం చేయాలనీ లేని పక్షంలో వాటి...
చలికాలంలో పెద్దలు, పిల్లలు ఎక్కువగా ఉన్నితో తయారుచేసిన స్వెట్టర్లు ధరిస్తూ ఉంటారు. వీటి మీద మురికి చేరినప్పుడు వాటిని జాగ్రత్తగా శుభ్రం చేయాలనీ లేని పక్షంలో వాటి మన్నిక దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. స్వెట్టర్ మీద చేరిన మురికిని సులువుగా తొలగించే చిట్కాలు...
ఒక గిన్నెలో అర కప్పు వెనిగర్‌ను తీసుకుని అందులో అర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో పలుచని చేతి రుమాలును ముంచి దానితో స్వెట్టర్‌ను తుడవాలి. మురికి ఎక్కువగా ఉన్న భాగాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. తరువాత గాలి తగిలేలా ఆరబెట్టాలి.
ఒక బకెట్ నీటిలో లిక్విడ్ డిటర్జెంట్ వేసి బాగా కలపాలి. ఈ నీళ్లలో స్వెట్టర్‌ను ముంచి అయిదు నిమిషాలు నాననివ్వాలి. ఆపైన చేతులతో సున్నితంగా రుద్దాలి. తరువాత స్వెట్టర్‌ను మంచినీళ్లలో ఒకసారి ముంచి ఆరేయాలి.
చిన్న గిన్నెలో రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి అందులో అరకప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. స్వెట్టర్ మీద మురికిగా ఉన్న చోట ఈ నీటిని కొద్ది కొద్దిగా చిలకరించి వేళ్లతో నుసిమి మెల్లగా పిండేయాలి. ఆపైన గాలికి ఆరబెట్టాలి.
స్వెట్టర్‌ను హ్యాంగర్‌కు వేలాడదీసి దానిమీద కొద్దిగా కార్బొనేటెడ్ వాటర్‌ను స్ర్పే చేస్తే చాలు. చెమట వాసన, దుమ్ము తదితరాలు తొలగిపోతాయి.
ఒక బకెట్లో సగానికిపైగా గోరువెచ్చని నీళ్లు పోసి అందులో రెండు చెంచాల ఉప్పు, కొద్దిగా షాంపూ వేసి బాగా కలపాలి. ఈ నీళ్లలో బాగా మాసిన స్వెట్టర్‌ను పది నిమిషాలపాటు నానబెట్టాలి. తరువాత చేతి వేళ్లతో సున్నితంగా ఉతికి మంచి నీళ్లలో ముంచి ఆరేయాలి.
స్వ్టెట్టర్ మీద నూనె లేదా గ్రీజు మరకలు పడితే వాటి మీద కొద్దిగా టాల్కం పౌడర్ చల్లి చేతి రుమాలుతో తుడిస్తే సరిపోతుంది.
ఇవి కూడా చదవండి
హక్కుల తీర్మానం గురించి అడిగితే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇదే
ఐదెన్ మార్‌క్రమ్ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో సఫారీల అద్భుత పోరాటం..
Updated Date - Dec 04 , 2025 | 01:41 AM