ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Christmas Feast Recipes: క్రిస్మస్‌ విందు..

ABN, Publish Date - Dec 20 , 2025 | 06:57 AM

క్రిస్మస్‌ పండుగ రోజున ఇంటికి బంధుమిత్రులు వస్తుంటారు. కేకులు, కుకీలతోపాటు వెరైటీ వంటకాలు కూడా తయారు చేసి వడ్డిస్తే వారి ఆనందానికి అవధులుండవు. అలాంటి అరుదైన మాంసాహార రుచులు మీకోసం...

వంటిల్లు

టర్కీ పెప్పర్‌ ఫ్రై

క్రిస్మస్‌ పండుగ రోజున ఇంటికి బంధుమిత్రులు వస్తుంటారు. కేకులు, కుకీలతోపాటు వెరైటీ వంటకాలు కూడా తయారు చేసి వడ్డిస్తే వారి ఆనందానికి అవధులుండవు. అలాంటి అరుదైన మాంసాహార రుచులు మీకోసం.

కావాల్సిన పదార్థాలు

ఫ టర్కీ చికెన్‌ ముక్కలు- అర కేజీ, బాస్మతి బియ్యం- రెండు కప్పులు, నూనె- రెండు చెంచాలు, యాలకులు- రెండు, లవంగాలు- మూడు, బిర్యానీ ఆకు- ఒకటి, దాల్చిన చెక్క- రెండు చిన్న ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ చీలికలు- అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, ధనియాల పొడి- ఒక చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, గరం మసాల పొడి- ఒక చెంచా, మిరియాల పొడి- రెండు చెంచాలు, కమ్మటి పెరుగు- ఒక కప్పు, వెన్న- ఒక చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, పచ్చి మిర్చి చీలికలు- అయిదు, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

ఫ స్టవ్‌ మీద కుక్కర్‌ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. ఆపైన యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి బాగా కలపాలి. అయిదు నిమిషాల తరువాత టర్కీ చికెన్‌ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పొడి, ఒక చెంచా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. అవన్నీ రెండు నిమిషాలపాటు వేగాక పెరుగు వేసి ఒక కప్పు నీళ్లు పోసి మరోసారి బాగా కలపాలి. కుక్కర్‌ మీద మూతపెట్టి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి అదనంగా ఉన్న నీటిని గిన్నెలోకి తీయాలి. ఆపైన కుక్కర్‌లో కరివేపాకు, వెల్లుల్లి పేస్టు, ఒక చెంచా మిరియాల పొడి, పచ్చి మిర్చి చీలికలు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలపాటు వేగనివ్వాలి. తరువాత ఉప్పు సరిచేసుకుని స్టవ్‌ మీద నుంచి దించాలి.

  • రైస్‌ కుక్కర్‌లో.. కడిగిన బాస్మతి బియ్యం, వెన్న, కొద్దిగా ఉప్పు వేసి నాలుగు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. తరువాత టర్కీ చికెన్‌ కూర నుంచి తీసిన నీటిని బాస్మతి అన్నంపై కొద్ది కొద్దిగా చిలకరించి మూత పెట్టాలి.

  • వెడల్పాటి గిన్నెను తీసుకుని మధ్యలో చిన్న గిన్నెను బోర్లించాలి. చుట్టూరా బాస్మతి అన్నాన్ని పరచాలి. దీనిమీద సర్వింగ్‌ ప్లేట్‌ను బోర్లించి రివర్స్‌ చేయాలి. ప్లేట్‌లో అన్నం మధ్యలో ఉన్న గిన్నెను తీసివేసి అక్కడ టర్కీ పెప్పర్‌ ఫ్రై కర్రీని ఉంచాలి. ప్లేట్‌లో చుట్టూరా ఉల్లిపాయల చక్రాలు, కీర చక్రాలు, నిమ్మ చెక్కలు ఉంచి కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్‌ చేయాలి.

చికెన్‌ విందాలూ

కావాల్సిన పదార్థాలు

బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కలు- అర కేజీ, ఎండు మిర్చి- పది, అల్లం- రెండు చిన్న ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, వేయించిన మెంతులు- పావు చెంచా, మిరియాలు- అర చెంచా, జీలకర్ర- ఒక చెంచా, ఆవాలు- అర చెంచా, దాల్చిన చెక్క- చిన్న ముక్క, లవంగాలు- మూడు, యాలకులు- రెండు, చింతపండు- కొద్దిగా, పసుపు- పావు చెంచా, ఉప్పు- తగినంత, ధనియాల పొడి- ఒక చెంచా, వెనిగర్‌- ఒక చెంచా, నూనె- మూడు చెంచాలు, ఎండు మిర్చి గింజలు- అర చెంచా, చక్కెర- అర చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

ఫ మిక్సీలో ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, చింతపండు వేసి పావు గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. వెడల్పాటి గిన్నెలో చికెన్‌ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ముందుగా గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మసాల పేస్టు, వెనిగర్‌ వేసి బాగా కలపాలి. దీన్ని గంటసేపు నాననివ్వాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.

  • స్టవ్‌ మీద మందపాటి పెద్ద గిన్నెపెట్టి నూనె వేసి వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. అవి వేగిన తరువాత చికెన్‌ ముక్కల మిశ్రమం వేసి కలపాలి. అయిదు నిమిషాల తరువాత ఒక కప్పు నీళ్లు పోసి మూతపెట్టి చిన్న మంట మీద మగ్గించాలి. పది నిమిషాల తరువాత మూత తీసి ఎండు మిర్చి గింజలు, చక్కెర వేసి కలపాలి. చికెన్‌ ముక్కలు బాగా ఉడికి మిశ్రమం దగ్గరికి వచ్చిన తరువాత కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ చికెన్‌ విందాలూ.. వేడి అన్నం, చపాతీల్లోకి రుచిగా ఉంటుంది.

డక్‌ మొయిలీ

కావాల్సిన పదార్థాలు

బాతు మాంసం ముక్కలు- అర కేజీ, కొబ్బరిపాలు- రెండు కప్పులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, అల్లం పేస్టు- ఒక చెంచా, వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, పచ్చి మిర్చి- నాలుగు, జీలకర్ర- ఒక చెంచా, ఆవాలు- ఒక చెంచా, పసుపు- అర చెంచా, ధనియాల పొడి- ఒక చెంచా, గరం మసాల పొడి- ఒక చెంచా, నూనె- మూడు చెంచాలు, ఉప్పు- తగినంత, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడిచేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాల పొడి వేసి బాగా కలపాలి. ఇవన్నీ వేగిన తరువాత బాతు మాంసం ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాలు మగ్గించాలి. తరువాత మూత తీసి కొబ్బరిపాలు పోసి ఉడికించాలి. కూర దగ్గరకు వచ్చిన తరువాత కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ డక్‌ మొయిలీ.. వేడి అన్నం, బగారా రైస్‌, చపాతీల్లోకి బాగుంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 06:57 AM