ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Boho Skirt Fashion: భలే బోహో

ABN, Publish Date - Dec 10 , 2025 | 05:11 AM

సౌకర్యం ప్రధానంగా రూపొందే దుస్తులు మళ్లీ మళ్లీ ట్రెండ్‌గా మారుతూనే ఉంటాయి. బోహో స్కర్ట్స్‌ ఆ కోవకు చెందినవే! తాజాగా ట్రెండ్‌గా మారిన ఈ ఫ్యాషన్‌ మహిళలను విపరీతంగా...

ఫ్యాషన్‌

సౌకర్యం ప్రధానంగా రూపొందే దుస్తులు మళ్లీ మళ్లీ ట్రెండ్‌గా మారుతూనే ఉంటాయి. బోహో స్కర్ట్స్‌ ఆ కోవకు చెందినవే! తాజాగా ట్రెండ్‌గా మారిన ఈ ఫ్యాషన్‌ మహిళలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాబట్టి మగువల మనసులను దోచుకుంటున్న బోహో స్కర్ట్స్‌ గురించి తెలుసుకుందామా...

లేత ఆకుపచ్చ, నీలం, లేత నారింజ... ఇలా ప్రకృతిలో కంటపడే సహజసిద్ధ రంగులను కలిగి ఉండడం బోహో స్టైల్‌ ప్రత్యేకత. మరీ ముఖ్యంగా బోహో స్టైల్‌లో రూపొందే స్కర్ట్స్‌ సర్వత్రా మగువలను ఆకట్టుకుంటూనే ఉంటాయి. మిడీ, మినీ, లాంగ్‌.. ఇలా వేర్వేరు పొడవుల్లో రూపొందే బోహో స్కర్క్స్‌ హై వెయిస్ట్‌, ఫ్రంట్‌ బటన్స్‌ను కలిగి ఉంటాయి. ప్రింట్లతో, సాదాగా రూపొందే బోహో స్కర్ట్స్‌ను సందర్భానికి తగ్గట్టు ఎంచుకోవడంతో, వాటిని సరైన యాక్సెసరీస్‌తో జోడించి ధరిస్తూ ఉండాలి. అదెలాగంటే...

డెనిమ్‌: డెనిమ్‌తో తయారయ్యే బోహో స్కర్ట్‌కు ప్రింటెడ్‌ బ్లౌజ్‌ను ఎంచుకోవాలి. అలాగే ఈ డ్రస్‌కు కౌబాయ్‌ బూట్లు చక్కగా నప్పుతాయి

సాదా: ప్లెయిన్‌ స్కర్ట్‌ ఎంచుకుంటే, దానికి ముదురు రంగు టాప్‌ జోడించాలి. స్లీవ్‌లెస్‌, బుట్ట చేతుల జాకెట్‌ సాదా బోహో స్కర్ట్‌కు చక్కగా నప్పుతాయి. చేతికి లెదర్‌ బ్రేస్‌లెట్‌, కాళ్లకు బూట్లు, జర్మన్‌ సిల్వర్‌ ఆభరణాలు ఈ దుస్తులకు సూటవుతాయి

మిని : బోహో లుక్‌ను మరిపించేలా మిని స్కర్ట్‌ ధరించాలనుకుంటే, దానికి లెదర్‌ జాకెట్‌ మ్యాచ్‌ చేయాలి. సిల్వర్‌ జ్యువెలరీ, లెదర్‌ వాచ్‌, తోలు చెప్పులు ఈ దుస్తులకు బాగా నప్పుతాయి

ప్రింటెడ్‌: ప్రింటెడ్‌ స్కర్ట్‌ ఎంచుకుంటే, సాదా టాప్‌ వేసుకోవాలి. ముందరి వైపు గుండీలున్న స్కర్ట్‌కు, క్రాప్‌ టాప్‌, బెల్ట్‌ బాగుంటాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 05:11 AM