Best Protein Sources for Vegetarians: శాకాహారులకు ప్రొటీన్లు ఎలా
ABN, Publish Date - Dec 10 , 2025 | 05:27 AM
రోగనిరోధక శక్తి పెంపొందడానికి, ఎముకల బలోపేతానికి, హార్మోన్ల సమతౌల్యానికి, ప్రశాంతమైన నిద్రకు ప్రొటీన్లు దోహదం చేస్తాయి. శరీరానికి...
రోగనిరోధక శక్తి పెంపొందడానికి, ఎముకల బలోపేతానికి, హార్మోన్ల సమతౌల్యానికి, ప్రశాంతమైన నిద్రకు ప్రొటీన్లు దోహదం చేస్తాయి. శరీరానికి అవసరమైన మోతాదులో ప్రొటీన్లు అందాలంటే శాకాహారులు ఏ పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం...
శనగలు, పెసలు, మినపగుండ్లు, రాజ్మా, చిక్కుళ్లు, బఠాణీలు, క్వినోవా, పాలు, పెరుగు, పన్నీర్ తదితరాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రొటీన్లు పొందవచ్చు. .
రోజుకు పావు కప్పు సోయాబీన్స్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లలో 70 శాతం వరకు అందుతుంది. ఒక కప్పు సోయా పాలు తాగినా ఫలితం లభిస్తుంది.
నువ్వులు, అవిసెలు, గుమ్మడి గింజలను రోజుకు ఒక రకాన్ని రెండు చెంచాల చొప్పున ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో ప్రొటీన్ల లోపం ఏర్పడదు.
రోజూ రాత్రి పడుకునేముందు పది బాదం పప్పులను నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు లభిస్తాయి.
వేరుశనగ గుండ్లలో అర్జినైన్ అనే ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నేరుగా వేయించుకుని తినవచ్చు లేదా నీటిలో నానబెట్టి గుగ్గిళ్లు చేసుకోవచ్చు.
జామ, పనస, బ్లాక్ బెర్రీ, కివీ, చెర్రీ, అరటి, నారింజ, దానిమ్మ పండ్లలో కూడా కొద్దిమోతాదులో ప్రొటీన్లు ఉంటాయి. వీటిని తరచూ తింటూ ఉంటే శరీరంలో ప్రొటీన్ లోపం ఏర్పడదు.
ఈ వార్తలు కూడా చదవండి..
థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 10 , 2025 | 05:27 AM