ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fruits to Eat at Night: రాత్రిపూట ఈ పండ్లు తినాలి

ABN, Publish Date - Nov 19 , 2025 | 05:29 AM

పలు కారణాల వల్ల పగటిపూట పండ్లు తినడం వీలు కాని వారు రాత్రిపూట తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో ఏ పండ్లు తినాలో తెలుసుకుందాం...

పలు కారణాల వల్ల పగటిపూట పండ్లు తినడం వీలు కాని వారు రాత్రిపూట తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో ఏ పండ్లు తినాలో తెలుసుకుందాం...

  • రాత్రి భోజనం తరువాత కివి పండ్లు తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. శరీరంలో సెరటోనిన్‌ ఉత్పత్తి పెరిగి చక్కగా నిద్ర పడుతుంది. కివి పండ్లలో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్దకం రాకుండా కాపాడతాయి.

  • చెర్రీ పండ్లు తినడం వల్ల శరీరంలో మెలటోనిన్‌ ఉత్పత్తి అవుతుంది. దీంతో వెంటనే నిద్ర ముంచుకొస్తుంది. చెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. చలికాలంలో తరచూ వచ్చే జలుబు, దగ్గు, తలనొప్పి లాంటి సమస్యలు తగ్గుతాయి.

  • అరటి పండ్లను కూడా రాత్రిపూట తినవచ్చు. అరటి పండ్లలో అధికంగా ఉండే మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్‌ శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగేలా చేస్తాయి. నిద్రలో కండరాలు పట్టేయకుండా, బీపీ పెరగకుండా కాపాడతాయి. రోజూ రాత్రిపూట అరటిపండు తినడం వల్ల గుండె జబ్బులు రావు.

  • బ్లూ బెర్రీ, రాస్‌ బెర్రీలు తినడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇవి ఔషధంలా పనిచేస్తాయి. కేన్సర్‌ రాకుండా కాపాడతాయి.

  • రాత్రి భోజనంలో అవకాడో చేర్చుకోవడం వల్ల అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

  • పుచ్చకాయలు, తర్బూజా పండ్లను కూడా రాత్రి సమయంలో తినవచ్చు. వీటిలోని పోషకాలు జీవక్రియలను వేగవంతం చేస్తాయి. శరీరంలోని ద్రవాలు సమతుల్యంగా ఉండేలా చూస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2025 | 05:30 AM