ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bandaru Sweets: బందరు మిఠాయిలు సంక్రాంతికి ప్రత్యేకం

ABN, Publish Date - Dec 28 , 2025 | 05:31 AM

బందరు లడ్డూ అంటే ఇప్పటికీ ఎంతో క్రేజ్‌. దీనికి జియోగ్రాఫికల్‌ గుర్తింపు వచ్చిన తరువాత విదేశాల్లో సైతం బందరు పేరు మారుమోగుతోందంటున్నారు మచిలీపట్నం మల్లయ్య స్వీట్స్‌...

బందరు మిఠాయిలు

బందరు లడ్డూ అంటే ఇప్పటికీ ఎంతో క్రేజ్‌. దీనికి జియోగ్రాఫికల్‌ గుర్తింపు వచ్చిన తరువాత విదేశాల్లో సైతం బందరు పేరు మారుమోగుతోందంటున్నారు మచిలీపట్నం మల్లయ్య స్వీట్స్‌ అధినేత గౌర వెంకటేశ్వర రావు. లడ్డూలే కాదు సంక్రాంతి పండుగ సమయంలో ఇక్కడి పిండివంటలకు కూడా అత్యధికంగా డిమాండ్‌ ఉంటుందంటున్నారు ఆయన. అందుకే ఈడేపల్లిలో పెద్ద కార్ఖానాను స్థాపించారు.

ఇక్కడ ఆయన స్వయంగా పిండి వంటలు తయారు చేస్తూ కనిపిస్తుంటారు కూడా.

వంటకాల తయారీలో చేయి తిరిగిన గ్రామీణ మహిళలు ఎందరో ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. దేశ విదేశాల్లో పేరు పొందిన బందరు మిఠాయిలపై ప్రత్యేక కథనం..

ప్రత్యేకత ఏంటంటే...

పిండి వంటల తయారీకి ఎలాంటి యంత్ర పరికరాలు ఉపయోగించరు. ప్రతి పనినీ ఇక్కడి మహిళలు చేతులతోనే చేస్తారు. వంటకాలన్నీ ఇంట్లో తయారుచేసుకున్నట్లే రుచిగా శుచిగా ఉంటాయి. అరిసెలు, కజ్జికాయలు, సున్నుండలు, పూతరేకులు, బందరు హల్వా, నల్ల హల్వా, జిలేబీ లాంటి స్వీట్లతోపాటు స్పెషల్‌ బూందీ, చక్రాలు, కారప్పూస, చేకోడీలను కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. పండుగనాటికి నేతి అరిసెలు, నువ్వుల అరిసెలు, మామూలు అరిసెలను ఒక్కోటి రెండువేల కేజీలు తయారుచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి తయారీ కోసం మహిళలు బియ్యాన్ని నానబెట్టి రోట్లో వేసి రోకలితో దంచి పిండి తయారు చేసి జాగ్రత్తగా ఆరబెడతారు. ముదురు గోధుమ రంగులో ఉండే పుట్ట బెల్లాన్ని, స్వచ్చమైన నెయ్యిని ఉపయోగిస్తారు. ‘ఏటా సంక్రాంతి పండక్కి అరిసెలను ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు పంపుతూ ఉంటాం. ఈసారి కలకత్తా నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి’ అని చెబుతున్నారు మహిళలు.

బందరు లడ్డు..

సంక్రాంతికి సంప్రదాయ పిండి వంటకాలతో పాటు బందరు లడ్డూ కూడా ఉండాల్సిందే! దీని పేరు వింటేనే ఎప్పుడు రుచి చూద్దామా అనిపిస్తుంది. బందరు లడ్డూ తయారీ విభిన్నంగా ఉంటుంది. శనగపిండితో బూందీ తయారుచేసి దాన్ని రోకలితో దంచడంతో ఒక విధమైన ముడి పదార్దం తయారు అవుతుంది. దాన్ని తగినంత బెల్లం పాకంతో మేళవించడం గొప్ప ఆర్ట్‌. అనుభవం ఉన్నవారికి మాత్రమే అది సాధ్యం. అందుకే బందరు లడ్డూకి అంత పేరు వచ్చింది.

స్పెషల్‌ కజ్జికాయలు

సంక్రాంతి స్పెషల్స్‌లో బందరు కజ్జికాయలకు మంచి పేరుంది. వీటిలో పలు వెరైటీలు ఉన్నాయి. బొంబాయిరవ్వ, పంచదార తో తయారు చేసే కజ్జికాయలకు, వేరుశనగపప్పు, బెల్లంతో తయారు చేసే కజ్జి కాయలకు ఎంతో తేడా ఉంటుంది. దేని రుచి దానిదే. కొబ్బరి, బెల్లం, కోవా కలిపి కూడా కజ్జికాయలు తయారు చేస్తారు. వీటిని కోవా కజ్జికాయలు అంటారు.

నల్ల హల్వా

ముందుగా గోధుమలను నానబెట్టి వాటిని దంచుతూ పాలు తీస్తారు. ఈ గోధుమపాలకు సమతూకంగా బెల్లం, నేతిలో వేయించిన జీడిపప్పు వేసి దగ్గరకు ఉడికిస్తారు. ఈ హల్వా మృదుమధురంగా మెత్తగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటుంటారు.

ముదిగొండ శాస్త్రి,

మచిలీపట్నం

ఇవి కూడా చదవండి

టీమిండియా టెస్ట్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? డేంజర్‌లో గంభీర్ పదవి!

అడవిలో గడ్డి కోస్తుండగా ఊహించని విషాదం..

Updated Date - Dec 28 , 2025 | 05:31 AM