Chennai: అవును.. వారిద్దరి మధ్య మళ్లీ మొదలైందిగా.. విషయం ఏంటంటే..
ABN, Publish Date - Feb 21 , 2025 | 06:49 AM
రాష్ట్రంలో త్రిభాష విద్యావిధానం అమలు చేసి హిందీ భాషకు పట్టంగట్టే ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ ‘మోదీ గెట్ అవుట్’ నినాదంతో ఉద్యమాన్ని నిర్వహించాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఉదయనిధి, అన్నామలై మాటల యుద్ధం
- పరస్పర విమర్శలతో వేడెక్కిన రాజకీయం
చెన్నై: రాష్ట్రంలో త్రిభాష విద్యావిధానం అమలు చేసి హిందీ భాషకు పట్టంగట్టే ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ ‘మోదీ గెట్ అవుట్’ నినాదంతో ఉద్యమాన్ని నిర్వహించాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరిద్దరి విమర్శనాస్ర్తాలతో హఠాత్తుగా రాజకీయ వేడి రాజుకుంది.
ఈ వార్తను కూడా చదవండి: Kumbh Mela: మహా కుంభమేళా ప్రారంభానికి ముందే నీళ్ల మీద పరీక్ష జరిపి..
రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో డీఎంకే నేతల పిల్లలు హిందీ చదువుతున్నారని, అలాంటప్పుడు త్రిభాషా విధానాన్ని ఎందుకు అమలు చేయరని అన్నామలై ప్రశ్నించారు. దీనిపై ఉదయనిధి స్పందిస్తూ ఆ హిందీ నేర్పుతున్న ప్రైవేటు పాఠశాలలన్నీ కేంద్ర ప్రభుత్వ అనుమతితో నడుస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని చోటేలేదన్నారు.
ఈ నేపథ్యంలో సేలంలో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ ఇటీవల డీఎంకే మిత్రపక్షాల సమావేశంలో హిందీని దొడ్డిదారిన అమలు చేసేందుకు ప్రయత్నిస్తే రాష్ట్రం నుండే ‘మోదీ గెటవుట్’ అనే నినాదంతో ఉద్యమం జరుపుతామని ఉదయనిధి దురుసుతనంతో ప్రకటించారని, మంత్రిగా ఉంటూ ఇలా విమర్శ చేయడం తగదన్నారు. ఉదయనిధి మోదీ గెట్‌అవుట్ నినాదానికి స్వస్తి పలకాలని లేకుంటే శుక్రవారం ఉదయం తన ఎక్స్‌పేజీలో స్టాలిన్ గెట్‌అవుట్ అనే నినాదాన్ని పోస్టు చేస్తానని, ఆ తర్వాత రెండు నినాదాల్లో దేనికి ప్రజల మద్దతు అధికంగా ఉంటుందో తేల్చుకుందామా అంటూ సవాలు విసిరారు.
ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా
ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ
ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
Read Latest Telangana News and National News
Updated Date - Feb 21 , 2025 | 06:53 AM