Prasanna Kamakshi, సిందూర్ తో మనసు కుదుటపడింది
ABN, Publish Date - May 08 , 2025 | 04:38 AM
భర్త మృతికి న్యాయం జరిగింది అనిపించి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ప్రసన్న కామాక్షి. ప్రజల్లో భద్రతపై నమ్మకం పెరిగిందని అభిప్రాయపడ్డారు.
పహల్గాం మృతుడు మధుసూదనరావు భార్య ప్రసన్న కామాక్షి
కావలి, మే 7(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద స్థావరాలపై సైన్యం దాడి జరపడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తమకు నమ్మకం ఏర్పడిందని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదనరావు భార్య ప్రసన్న కామాక్షి వెల్లడించారు. బుధవారం కావలిలోని తన నివాసం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటితో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త పెద్దఖర్మలోపే ఉగ్రవాదులపై దాడులు చేయడంతో తన మనసు కొంత కుదుటపడిందన్నా రు. ఇలాంటి ఘటనలు ఇక జరగవని ప్రజలకు ప్రధాని నమ్మకం కలిగించారని కొనియాడారు. తనకు, తన పిల్లలకు వచ్చిన ఈ కష్టం ఏ కుటుంబానికీ రాకూడదన్నారు. తాము అనుభవించిన నరకాన్ని మాటల్లో చెప్పలేనన్నారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 04:38 AM