Train Journey: ఈ సమయంలో చైన్ లాగితే.. రైలు ప్రయాణంలో జరిమానా విధించరు.. ఎందుకో తెలుసా?
ABN, Publish Date - Mar 09 , 2025 | 05:29 PM
Train Journey: రైలులో చైన్ లాగితే జరిమానా విధిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ కొన్ని సమయాల్లో మాత్రం రైలులో చైన్ లాగితే.. జరిమానా విధించరు. ఎందుకో తెలుసా..? ప్రయాణికుడి భద్రతే లక్ష్యంగా రైల్వే శాఖ నిత్యం కసరత్తు చేస్తుంది. అలాంటి వేళ.. ప్రయాణికుడి కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ రైల్వే.. దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ. గతంలో దేశం మొత్తనికి ఒక బడ్జెట్ ఉంటే.. భారతీయ రైల్వేకు మరో బడ్జెట్ ఉండేది. కానీ మోదీ ప్రభుత్వం ఈ రైల్వే బడ్జెట్‌ను తీసి వేసి.. దానిని సాధారణ బడ్జెట్‌లో కలిపేసింది. అంటే భారతీయ రైల్వే అంతపెద్ద వ్యవస్థ అని అందరికి తెలిసిందే. ప్రపంచంలోనే భారతీయ రైల్వే నాలుగో స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయలనే కాదు.. కొత్త కొత్త రైళ్లను సైతం ప్రవేశపెడుతోంది. మరికొద్ది రోజుల్లో బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక వందే భారత్ రైళ్లు మాత్రం ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి.
ఇక ప్రయాణికుల కోసం కేంద్రం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వస్తుంది. అలాగే రైల్వే నిబంధనలను సైతం కఠినతరం చేసింది.. చేస్తోంది. ఇక ఎటువంటి కారణం లేకుండా రైళ్లు ఆలస్యంగా రావడంతో చాలా సార్లు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకు రైలులో చైన్ లాగడం ఒక కారణం.
Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?
చైన్ లాగడం కారణంగా.. రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో తీవ్ర ఆలస్యమవుతుంది. ఈ క్రమంలో రైళ్లు అనవసరంగా ఆలస్యం కాకుండా చూసేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ ‘టైమ్ కీపింగ్’ కింద అలాంటి వారిపై నిఘా ఉంచాయి. రైలులో కారణం లేకుండా చైన్ లాగినందుకు ఎంతో మందికి రైల్వే అధికారులు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
ఏ పరిస్థితుల్లో ట్రైన్‌లో చైన్ లాగవచ్చు:
కదులుతున్న రైలులో మంటలు చెలరేగితే చైన్ లాగి.. ఆపవచ్చు.
ప్రయాణ సమయంలో మీతో పాటు వృద్ధులు, వికలాంగులు ఉంటే, వారు రైలు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే.. అదే సమయంలో రైలు కదలడం ప్రారంభిస్తే.. ఆ పరిస్థితిలో అలారం చైన్ లాగడం చేయవచ్చు.
మీతో పాటు చిన్న పిల్లలు ప్రయాణించాల్సి ఉంటే.. వారు స్టేషన్‌లో ఉండి పోయి.. రైలు కదిలితే.. ఆ సమయంలో చైన్ లాగ వచ్చు.
ప్రయాణంలో ప్రయాణికుల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తే.. అటువంటి పరిస్థితులలో అలారం గొలుసు లాగవచ్చు.
రైలు ప్రయాణంలో దొంగతనం లేదా దోపిడీ జరిగినప్పుడు కూడా చైన్ లాగవచ్చు.
అయితే కారణం లేకుండా చైన్ లాగితే మాత్రం శిక్ష తప్పదు.. ఆ శిక్ష ఏమిటంటే..?
రైలులో ప్రయాణికుడు సరైన కారణం లేకుండా అనవసరంగా చైన్ లాగితే.. అతడికి శిక్ష తప్పదు. ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తే.. అతడిపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవచ్చు. అలారం చైన్‌ని లాగడం వల్ల ఆ రైలుతో పాటు, ఆ ట్రాక్‌పై తర్వాత వచ్చే అన్ని ఇతర రైళ్లు కూడా ఆలస్యమవుతాయి.
ఈ నేపథ్యంలో రైల్వే చట్టం- 1989, సెక్షన్ 141 అనుసరించి.. సరైన కారణం లేకుండా రైలు చైన్ లాగితే రూ.1000 జరిమానా లేదా ఓ ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు.. ఏకకాలంలో ఈ రెండు శిక్షలను సైతం విధించే అవకాశం సైతం ఉంది. అంటే ఓ ప్రయాణికుడికి 1 ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించే అవకాశముంది.
For National News And Telugu News
Updated Date - Mar 09 , 2025 | 06:33 PM