బ్లాక్ రైస్ (Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?
బ్లాక్ రైస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే షోషకాలు శరీరానికి శక్తినిస్తుందంటున్నారు. పలు అనారోగ్య సమస్యలను సైతం నివారించడంలో ఈ రైస్ సహాయపడుతోందని వారు పేర్కొంటున్నారు.
ఇవి ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, ఫైబర్, ఖనిజాలతో నిండిపోయి ఉంటాయి. వీటిలో ప్రధానంగా ఆంథోసైనిస్ అనే పదార్థం ఉంటుంది. అందువల్ల ఇవి నల్లని రంగులో ఉంటాయి.
బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండు పని తీరును మెరుగు పరిచి.. రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతాయి.
వీటిలో ఉండే.. ఫ్లెవనాయిడ్లు గుండె సంబంధిత వ్యాధుల తీవ్రతను తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతోపాటు రక్తపోటును అదుపులో ఉంచడంలో ఇవి సహాయపడతాయి
వీటిలో ఉండే ఆంథోసైనిన్ కారణంగా.. క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, కోలొరెక్టల్ క్యాన్సర్ తదితర సమస్యలను నుంచి రక్షణ కల్పిస్తోంది. ఇది ఆరోగ్యానికి చక్కటి రక్షణ కవచంలా పని చేస్తోంది.
ప్రస్తుతం మొబైల్, ల్యాప్ టాప్ అధికంగా వినియోగిస్తున్నారు. వీటి వల్ల కంటి సమస్యలు తీవ్రమవుతోన్నాయి. దీంతో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ముఖ్యమైన పోషకాలు ల్యూటిన్, జియాక్సంతిన్.. ఈ బియ్యంలో ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారికి బ్లాక రైస్ మంచి ప్రత్యామ్నాయం. వీటిలో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల కడుపు నిండిన భావన కలిగి అధికాహారం తీసుకోవడం తగ్గుతోంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి..కొవ్వును కరిగించడంలో సహాయపడుతోంది.
నిత్యం బ్లాక్ రైస్ తీసుకున్న వారు త్వరగా బరువు తగ్గారని పలు అధ్యయనాల్లో తేలింది.
టైప్-2 మధుమేహం ఉన్నవారు ఈ బియ్యాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తోంది. ఇందులోని ఆంథోసైనిన్ ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గిస్తోందని తేలింది.
బ్లాక్ రైస్ వండాలంటే.. ప్రత్యేకతలంటూ ఏమీ లేవు. వైట్ రైస్ వండినట్లు వండితే సరిపోతుంది.
బ్లాక్ రైస్‌ను ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవడం ఉత్తమం. రాత్రి తింటే జీర్ణమయ్యేందుకు కాస్తా అధిక సమయం పట్టే అవకాశముంది. ఈ రైస్‌ను సాంబార్, కూరలతో కలిపి తినవచ్చు.