ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hindu Tradition: ఆ ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమే ఆపరేషన్‌ సిందూర్‌

ABN, Publish Date - May 08 , 2025 | 04:32 AM

పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల బాధను ప్రతీకగా భావించి భారత ప్రభుత్వం దాడికి ఆపరేషన్‌ సిందూర్‌ అనే పేరును పెట్టింది. ఈ చర్య ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తీసుకున్నదిగా దేశ ప్రజల్ని చైతన్యం చేసింది.

ప్రధాని సూచించిన పేరుతో సైనిక చర్య!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’’ అనే పేరును ప్రధాని నరేంద్ర మోదీ పెట్టారు. ఈ పేరు ఎంపిక వెనుక చాలా అర్థం ఉంది. అదేంటంటే... పహల్గాంలో పర్యాటకులను తుపాకులతో చుట్టిముట్టిన ఉగ్రమూక... పురుషులనే లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. పేర్లు, మతం అడగటంతోపాటు కలిమా చదివించి మరీ ప్రాణాలు తీసింది. పిల్లల కళ్ల ముందే తండ్రిని, భార్య చూస్తుండగానే భర్తను చంపి మారణహోమం సృష్టించింది. ఓ నవ వధువు సహా చాలామంది ఆడబిడ్డలను వితంతవులను చేసింది. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహిత మహిళలు తమ నుదుటి మీద పెట్టుకునే బొట్టు(సిందూరం)ను ఎంతో పవిత్రంగా, వివాహానికి గుర్తుగా భావిస్తుంటారు. అంతటి విలువైన బొట్టును కోల్పోయిన మహిళల కన్నీటికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నామనే ఉద్దేశంతోనే సైనిక చర్యకు ‘‘ఆపరేషన్‌ సిందూర్‌’’ అనే పేరు పెట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రకటన చేస్తూ భారత ఆర్మీ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలో కూడా ఈ ఉద్దేశం స్పష్టమవుతోంది. ఆ చిత్రంలో సిందూర్‌ అనే పదం ఆంగ్లంలో రాసి ఉండగా.. అందులోని రెండు ‘ఓ’ల్లో ఒకదాని స్థానంలో సిందూరంతో నిండిన ఓ గిన్నెను ఉంచారు. ఆ గిన్నె నుంచి కొంత సిందూరం చెల్లాచెదురుగా పడి ఉన్నట్టు డిజైన్‌ చేశారు. మహిళలు తమ సిందూరాన్ని కోల్పోయారనే అర్థం వచ్చేలా అది ఉంది. ఇక, ఆ ఫొటోకు ‘‘ జస్టిస్‌ సర్వ్‌డ్‌.. జైహింద్‌’’ అనే శీర్షిక ఇవ్వడంతో ఆ పేరు వెనుక ఉద్దేశం మరింత స్పష్టమైంది.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:32 AM